మీడియా అకాడ‌మీ పాల‌క‌మండ‌లి స‌భ్యుల ఎంపిక‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 16: మీడియా అకాడమి పాలకమండలి కమిటీ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమి పాలక మండలి యొక్క సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తూ ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ దినపత్రికలలో ప్రకటన జారీ చేసినట్లు ఆయ‌న తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా పని చేయడానికి ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులను జర్నలిస్టు సంఘాలు తమ ప్రతినిధులుగా ప్రతిపాదించేందుకు  దరఖాస్తులను మీడియా అకాడమి వెబ్ సైట్  website: https://mediaacademy.telanganagov.in/ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని  లేదా  నాంపల్లిలోని అకాడమి కార్యాలయంలో దరఖాస్తులను పొందవచ్చని తెలిపారు.  ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ సాయింత్రం 5-00 గంటల వరకు స్వయంగా కానీ లేదా అకాడమి కార్యాలయ చిరునామాకు పోస్టు ద్వారా కాని సమర్పించ‌వ‌చ్చున‌న్నారు. ఇతర వివరాలకు మీడియా అకాడమి వెబ్ సైట్  website: https://mediaacademy.telangana.gov.in/ సంబంధిత ప్రకటనను డౌన్ లోడ్ చేసుకోవాలని కార్యదర్శి  తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *