హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: డ్రగ్స్ అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా హైదరాబాద్‌లో ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌ఎన్‌ఈడబ్ల్యు), మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం ఆపరేషన్ నిర్వహించారు. ఎండీఎంఏ(డ్రగ్స్) విక్రయిస్తున్న పెడ్లర్ ఒకరు, ఇద్దరు సబ్-పెడ్లర్లను వారు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 గ్రాముల ఎండీఎంఏడ్రగ్స్‌తోపాటు మూడు మొబైల్ ఫోన్లు, బైక్, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువు రూ.4.65 లక్షలు ఉంటుందని హెచ్‌ఎన్‌ఈడబ్ల్యు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరులో కొందరి వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు తమ విచారణలో వెల్లడిరచినట్లు తెలిపారు. నిందితులను ఉప్పుటూరి కార్తీక్ అలియాస్ అలెక్స్, చిరుమామిళ్ల బాలాజీ, తాండ్ర దీపక్‌గా గుర్తించామన్నారు. ఒక గ్రాము డ్రగ్‌ను సాచెట్లుగా ప్యాక్ చేసి విక్రయించినట్టు చెప్పారని వెల్లడిరచారు.
హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ పోలీసులు శనివారం మాదకద్రవ్యాలు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుండి 11 గ్రాముల %వీణవీA% డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





