ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య

– ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకుల హత్య

రాయ్‌పూర్‌, అక్టోబరు 25: ఓవైపు లొంగుబాట్లు మరోవైపు, మావోయిస్టుల ఏరివేత జరగుతున్నా వారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. స్థానికుల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఉసూరు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని నేల కాంకేర్‌ ‌గ్రామానికి చెందిన రవి కట్టం (25), తిరుపతి సోడి (38) లను ఎత్తుకెళ్లిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి హత్య చేశారు. వీరు పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారని, అందుకే హతమార్చామని ప్ర‌క‌టించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్టులు లొంగిపోవాలని, హింసకు పాల్పడితే సహించేది లేదని పోలీసు అధికారులు హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *