మహరాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరిగాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. శత్రువులు మిత్రులయ్యారు, మిత్రులు శత్రువులయ్యారు. మహారాష్ట్రలో ఏకపక్షంగా అధికారాన్ని చెలాయించాలన్న బీజేపీ లక్ష్యం మున్సిపల్ ఫలితాలతో నేరవేరింది. శివసేన కంచుకోటలను బీజేపీ బద్దలు కొట్టింది. థాక్రే కుటుంబం ఏకమైన బాల్‌థాక్రే లెగసిని థాక్రే బ్రదర్స్ నిలుపుకోలేకపోయారు. కాంగ్రెస్‌తో పాటు శివసేన, ఎన్సీపీ శరద్ పవార్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలను ఆనకొండలా మింగడంతో కాషాయ పార్టీ సక్సెస్ అయింది.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు దేశం దృష్టి బెంగాల్ ఎన్నికలపై పడింది. రాజకీయ పార్టీలు తూర్పు బంగ్లాలో పాగా వేసేందుకు ఎత్తులు, వ్యూహాలకు పదును పెట్టుతున్నాయి. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చాలా స్ట్రాటజీగా ప్రచారంలో దూకుడుమీదుంది. పార్లమెంట్, పలు రాష్ట్రాల్లో వెనుకబడినట్లే బెంగాల్ లో కూడా ఇండికూటమి వెనుబడి ఉంది. ఇప్పటికీ బెంగాల్లో సమస్యలను అడ్రెస్ చేయడంలో విఫలమయ్యాయి. ఇక పొత్తులు సీట్ల పంపకాలు సరేసరి.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సీట్ల పంపకం ఇండియా కూటిమికి సవాల్ గా మారింది. అదే ఓటమికి ప్రధాన కారణమైతే, బీజేపీ గెలుపుకు నాంది అవుతుంది. బెంగాల్లో ఇప్పుడు అదే జరుగుతుంది. త్రిముఖ పోరు ఉంటుందన్న దగ్గర నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేతులెత్తేయడంతో బీజేపీ టీఎంసీ మధ్య ద్విముఖ ఫైట్‌గా మారింది.ఇండి కూటమి అసర్థత, దీదీపై ఉన్న వ్యక్తిగత అసంతృప్తితో బీజేపీకి గెలుపుకు ప్రతిక్షాలు పరోక్షంగా దోహదపడుతున్నాయి.అటు కమలం పార్టీ కూడా బెంగాల్లో బీజేపీ కామన్ శత్రువులు ఏకం కాకుండా చూస్తుంది.
బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ యుద్దం జరుగుతోంది..దీదీ-మోదీ లు రాష్ట్రాన్ని రణక్షేత్రంగా మార్చారు. తమ రాజకీయ ఎత్తులు, వ్యూహాలు, కుట్రలు, ప్రత్యార్థులను ఓడించాలన్న జిత్తులతో బెంగాల్ అగ్నిగుండంగా మారింది. సహజంగానే కుల, మత రాజకీయాలతో సున్నితంగా ఉండే కోల్‌కతా ఇప్పుడు ఎన్నికల వేళ నివురుగప్పిన నిప్పులా ఉంది..అది ఏ క్షణంలోనైనా భగ్గుమంటుంది.
ఈ ఎన్నికల ఆధిపత్య పోరులో కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు చేతులెత్తేశారు. గెలుపుపై ఎమ్మోగానీ, కనీసం పోటీ చేసే విషయంలో కూడా తర్జనభర్జన పడుతున్నారు. అటు పార్లమెంట్, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికలేవైనా ఖచ్చితమైన వ్యూహంతో వెళ్లే బీజేపీ, బెంగాల్ ఎన్నికలను కూడా పటిష్టంగా తీసుకుంది. రెండేళ్ల ముందు నుంచే గెలుపు స్ట్రాటజీని అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే SIR, గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని దీదీ సర్కార్‌ను ఇబ్బంది పెట్టడం. తన దైన స్టైల్లో రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. బెంగాల్లో మత ఘర్షణలు సృష్టించేందుకు అన్ని కుట్రలు చేస్తుంది. సీఎం మమతా బెనర్జీ బీజేపీ కుట్రలన్నీ భగ్నం చేస్తూ, గవర్నర్ వ్యవస్థపై పోరాటం చేస్తోంది. కేంద్రంపై సివంగిలా ఒంటరిగానే పోరాడుతోంది. ఇండికూటమి దీదీకి అండగా నిలవకున్న బీజేపీతో తలపడుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి విచారణ సంస్థలతో రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టుతూ, దీదీని గద్దెదించే కుట్రలు చేస్తున్నా మమత ఎదురోడ్డి నిలుస్తోంది.
అయితే విచారణ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ, బంగ్లాదేశ్ బూచిని చూపిస్తూ, దేశ భద్రతా, అక్రమ వలసవాదులు సాకుతో బెంగాల్ లో సైన్యాన్ని దింపి బీజేపీ గుంపుగా దీదీపై దాడికి దిగింది. మమత సర్కార్‌ను అడుగడుగునా ఇబ్బంది పెట్టుతూ, ఇండి కూటమిలో లేని దీదీని ఒంటిరిని చేసి తొంగదీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కానీ రాయల్ బెంగాల్ టైగర్ గా పేరున్న దీదీ ఏనాడు కేంద్రానికి భయపడలేదు..బెంగాల్ పులిలాగానే జీవిస్తా, నన్నెవరూ భయపెట్టలేంటూ సవాల్ విసురుతోంది. నన్ను చాలెంజ్ చేస్తే, బీజేపీ పునాదులే కదిలిస్తానంటూ మోదీ -షాలకు సీఎం మమత వార్నింగ్ ఇస్తుంది.
బెంగాల్లో బీజేపీ ఆర్థిక, అధికారిక బలం ముందు దీదీ నిలవలేకపోతోంది. రోజురోజుకు రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజావ్యతిరేకతతో పాటు, చాపకింద నీరులా విస్తరిస్తున్న కాషాయ వ్యూహాలను ఎదుర్కొలేకపోతుంది. ప్రజా బలం తగ్గడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మంత్రులు, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరగడం, శారదా గ్రూప్ ఆర్థిక కుంభకోణాలతో పాటు, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు పెరగడంతో కమలం పార్టీ ప్రజల్లో దీదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమికి ఇవన్ని ముఖ్య కారణాలు కానున్నాయి.
అయితే ఈసారి బెంగాల్లో బీజేపీ జెండా ఎగరేసేందుకు కాషాయ పార్టీ పక్క వ్యూహంలో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అమిత్ షా, మోదీ లు బెంగాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. బెంగాల్లో మహా జంగిల్ రాజ్‌కు ముగింపు పక్కా అని ప్రధాని మోదీ శపథం చేశారంటే మమతను ఓడించేందుకు ఎంతటి పక్క ప్రణాళికలతో బీజేపీ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అడుగు దూరంలో మిస్సయ్యామని ఇప్పుడు ఎట్టిపరిస్థితిలో మిస్ కావొద్దని కసితో బీజేపీ ఉంది. ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే కాషాయ నేతలు, భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే బెంగాల్‌ను మరింత వ్యూహాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా కమలం పార్టీ తీసుకుంది.
ఇప్పటికే దేశంలో పెద్ద రాష్ట్రాలన్నిటీలో బీజేపీ పాగా వేసింది..బెంగాల్ ఒక్కటే మిగిలింది. ఇప్పుడు బెంగాల్లో కూడా గెలిచేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటుంది. కలిసి వచ్చే అంశాలను అనుకూలంగా మార్చుకుంటోంది. సహజంగానే మందిర్- మసీద్, హిందు- ముస్లీం అంటూ మత రాజకీయాలు చేసే బీజేపీ, అసలే మత రాజకీయాలతో నిత్యం సున్నితంగా ఉండే బెంగాల్లో ఆ ఎత్తుగడకు మరింత పదును పెట్టుతోంది. బెంగాల్‌ను కొట్టేందుకు ఖచ్చితమైన టార్గెట్‌ను బీజేపీ పెట్టుకుంది. ప్రాంతీయ పార్టీలకు సమాధి కట్టుతూ, జాతీయ పార్టీలను బలహీనపర్చుతు పవర్లోకి వచ్చేందుకు పక్క వ్యూహంతో ఉంది. రాష్ట్రంలో దీదీని బీజేపీ ఒంటరి చేయడంలో మొదటి సక్సెస్ అయింది.
గవర్నర్ వ్యవస్థను, విచారణ సంస్థలతో వేధిస్తూ..మమత పాలన, ప్రచారం వ్యూహాలపై ఫోకస్ పెట్టకుండా ఈడీ, గవర్నర్ వివాదాల చుట్టే తిప్పడంలోనూ..దీదీ వర్సెస్ ఈడీ, మమత వర్సెస్ గవర్నర్ వివాదాలో ప్రజలు విసుగుచెందేలా, సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా చేయడంలో కాషాయ పార్టీ రెండో విజయం అందుకున్నారు. చివరగా ఎన్నికల్లో టీఎంసీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే విచారణ సంస్థలు, గవర్నర్ వ్యవస్థతో పాటు ప్రభుత్వ అవినీతి, నేతల అక్రమాలు, కుంభకోణాలు, స్కామ్‌లు బంధుప్రీతిని బీజేపీ ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటుంది.
.2021 నుంచి రాష్ట్రంలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తుంది..గత అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చరిష్మా ముందు బీజేపీ తేలిపోయిన , పార్లమెంట్ ఎన్నికల్లో వోట్ షేర్ భారీగా పెంచుకోవడమే కాదు, సీట్లు పెంచుకుంది.ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది.
బెంగాల్లో దీదీ ఒంటరైంది. కేంద్రంపై పోరులో మిత్ర పక్షాలు కలిసి రావడం లేదు. బీజేపీనే కాదు, మమత తీరుపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక్షంగా బీజేపీతో కలిసి నడవకపోయిన పరోక్షంగా టీఎంసీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బెంగాల్లో దీదీ గ్రాఫ్ పడిపోతుంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఓట్ షేర్ కూడా పడిపోతుంది. దీదీ వ్యతిరేక వోట్ షేర్, ఇటు కాంగ్రెస్ కమ్యూనిస్ట్‌ల వ్యతిరేక వోట్ షేర్‌ను తన వైపు తిప్పుకునే ఎత్తుగడలో బీజేపీ ఉంది. తనకు అనుకూలంగా మార్చుకునే స్ట్రాటజీలో కమలం నేతులున్నారు.
బెంగాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న ఇండికూటమి పార్టీలు పోటీలో ఉన్నామని చెప్పే ప్రయత్నం కూడా కనీసం చేడయం లేదు. హర్యానా, దిల్లీ, మహారాష్ట్ర, బీహార్‌లో ఇండికూటమి విఫలం కావడంతో బెంగాల్ ఎన్నికలపై నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. బెంగాల్ ఎన్నికలను కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు లైట్ తీసుకున్నారు. బెంగాల్లో రాహుల్ గాంధీ సర్ పోరాటం సత్ఫలితాలు ఇస్తాయన్న నమ్మకం ఆ పార్టీలో కనిపించడం లేదు. ప్రజలు ‘సర్’ ను పట్టించుకోలేదని స్పష్టం అవుతుంది.
.ఈడీ వర్సెసీ దీదీలో వివాదంలో టీఎంసీకి రాజకీయంగా లబ్ది చేయడం కంటే, మమత వ్యవహరించిన తీరుతో భారీ నష్టం జరిగిందన్న చర్చ ఉంది. అటు బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితిని బీజేపీ అవకాశంగా మార్చుకుంటుంది. దీంతో బెంగాల్లో మత రాజకీయాలకు మరింత పదునుపెట్టుతుంది. దీదీ హిందు వ్యతిరేకి అనే ప్రచార దూకుడును పెంచింది. బెంగాల్లో విపక్షల మధ్య విభేదాలే బీజేపీ గెలుపుకు పునాదులు వేస్తున్నాయి. బీహార్‌లో ఎదురు దెబ్బతిన్న ఇండి కూటమికి ఇంకా కనువిప్పు కలగడం లేదు. ఉమ్మడి శత్రువును గుర్తించడంలో విఫలం అయ్యారు. బెంగాల్లో దీదీని ఓడించాలన్న క్రమంలో బీజేపీ గెలుపుకు మార్గం సుగమం చేస్తున్నారు.
.శత్రువు శత్రువును మిత్రుడిగా మార్చుకోవడం, ప్రాంతీయ పార్టీలు ఐక్యం కాకుండా, లోకల్ పార్టీల్లో విభజించి పాలించే బ్రిటిషోడి వ్యూహాలు బీజేపీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అమలు చేస్తుంది. గెలుపు అసాధ్యమనుకున్న రాష్ట్రాల్లో కూడా గెలుపును సునాసంగా ముద్దాడుతుంది. బీహార్, దిల్లీ, మహారాష్ట్రతో పాటు చాలా రాష్ట్రాల్లో అదే వ్యూహాలతో బీజేపీ పవర్లోకి పవర్లోకి రావడమే కాదు కాంగ్రెస్‌ను, బలమైన ప్రాంతీయ పార్టీలను బలహీనర్చింది.
ఉత్తరాదికే పరిమితమైన బీజేపీ వ్యూహాలు మహారాష్ట్రతో పశ్చిమ భారత్‌కు ఇప్పుడు బెంగాల్లో తూర్పు భారత్‌కు విస్తరించింది.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు తెలంగాణ, ఏపీతో దక్షిణాదిలో పాగావేసే వ్యూహంలో కాషాయ పార్టీ ఉంది. తమినాడు, కేరళ, కర్నాటకలో గవర్నర్ల వ్యవహరిస్తున్న తీరును భవిష్యత్ బీజేపీ వ్యూహాలేంటే స్పష్టం చేస్తున్నాయి.
తోటకూర రమేష్





