– సన్న బియ్యం తీసుకున్న వారంతా వోటేయాలి
– మున్సిపల్ ఎన్నికల తరవాత రైతుభరోసా
– రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నాం
– తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్
- తెలంగాణ తల్లి మన సోనియమ్మ
– మిర్యాలగూడ ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి
మిర్యాలగూడ,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేదు.. విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ’ సభలో సీఎం ప్రసంగించారు. రేషన్ కార్డుల కోసం గతంలో పదేళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీకి వోటు వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్‌కే వోటు వేయాలని పిలుపునిచ్చారు. వరి ఉత్పత్తిలో మిర్యాలగూడ ఆసియాలోనే ముందుంది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ బీఫాం మీద పోటీ చేస్తున్న ఆడబిడ్డలకు కూడా ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వివక్ష చూపలేదు. రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతు భరోసా కింద రూ.6వేల చొప్పున రూ.9వేల కోట్లు ఇచ్చాం. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు జమ చేస్తాం. దేశంలో అత్యధికంగా రైతుల కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఏప్రిల్‌లో కొత్త బ్జడెట్‌లో లక్షలాది ఇళ్లు పేదలకు ఇస్తాం. పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత తీసుకుంటాం. నల్గొండ జిల్లాపై కోపంతో ఎస్‌ఎల్‌బీసీని పక్కనపెట్టారు. ఎస్‌ఎల్‌బీసీ ఆగిపోతే మామ, అల్లుళ్లు దావతు చేసుకున్నారు. నల్గొండ ప్రజలు ప్లోరైడ్ నీళ్లు తాగడానికి కారణం బీఆర్‌ఎస్. రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టాం.
కేసీఆర్‌కు నోటీసు ఇస్తే తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెబుతున్నరు
కేసీఆర్‌కు పోలీసులు నోటీసు ఇస్తే తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెబుతున్నారని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను మార్చి, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం విమర్శించారు. సన్నబియ్యం పొందుతున్న లబ్దిదారులంతా కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా అందిస్తామని సీఎం హా ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు పథకం నిజంగా వరంగా మారిందని, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న మహిళలు కాంగ్రెస్‌కు వోటేస్తే.. బిఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇతర నాయకులకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదని సీఎం విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం డిమాండ్ ఉందని, రాబోయే బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడతామని హా ఇచ్చారు. గత ప్రభుత్వం నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతో ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రమాదంలో 8 మంది మృతి చెందితే మామ అల్లుళ్లు సంబరాలు చేసుకున్నారని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. గంజి గతి లేని నాయకులు బెంజ్ కార్లు కొనుగోలు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మిగితా నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ వోటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీఎం ఆరోపిస్తూ.. జాతిపిత ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌నే జాతిపిత అని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అని స్పష్టం చేశారు. రెండేళ్లలో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వోటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ గెలిస్తే పేదవారు గెలుస్తారు అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




