మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల

– ప్రజాభవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు
-ఆర్టీసీ అద్దె బస్సుల మొదటి నెల అద్దె అందజేత
– మంత్రి సీతక్కతో మహిళా సంఘాల ముఖాముఖి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల.. మండల సమాఖ్యలో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయి.. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రజాభవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఉచిత బస్సు ప్రయాణంతోపాటు బస్సులకు మహిళలను ప్రభుత్వం ఓనర్లను చేసిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రూ.25 వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలు పొందాయని, తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తుండడంతో బ్యాంకులు ఇబ్బందులు లేకుండా రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. మహిళలందరూ ఎల్లుండి నుంచి సంబరాలు చేయాలన్నారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.70 వేల అద్దెను ఆర్టీసీ ద్వారా చెల్లిస్తున్నామని, మొదటి నెలలోనే మహిళా సంఘాలకు రూ.కోటి పైగా అందజేశామని చెప్పారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రికి మహిళా సంఘాల తరఫున సీతక్క ధన్యవాదాలు తెలిపారు. మహిళలందరినీ ఏకం చేసే వేదికగా ఇందీరా మహిళా శక్తి నిలుస్తుందని, స్వయం ఉపాధి నుంచి కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రతి రంగంలో మహిళలకు అవకాశం ఇస్తున్నామన్నారు. బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకు రుణాలు ఎగవేస్తుంటే తెలంగాణ మహిళలు క్రమశిక్షణగా చెల్లిస్తున్నారని,
అందుకే మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు క్యూ కడుతున్నాయని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు కొత్తగా ఎన్నికైన ఆడబిడ్డలందరికీ అభినందనలు తెలిపారు. ఇందిరా మహిళా శక్తితో మహిళల కష్టాలు తీరి వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళల అనుభవాలను తెలిపే పుస్తకం ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై పుస్తకంలోని కవితను మంత్రి పొన్నం ప్రభాకర్‌ చదివి వినిపించిన సందర్భంలో మహిళల చప్పట్లతో ప్రజాభవన్‌ మారుమోగింది. కాగా, మంత్రి సీతక్కతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా సంఘాలు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ చేయూతతో వ్యాపారాలు బాగా నడుస్తాన్నాయని తమ అనుభవాలను పంచుకున్నాయి. ఇందిరా మహిళా విజయాలను ఆడి పాడి సంబరాలు చేసుకున్న మహిళలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *