– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– నివాళులర్పించిన సీఎం రేవంత్, స్పీకర్, మేయర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సమాజహితానికి, సమానత్వానికి కష్టపడిన మహారాజా అగ్రసేన్ ఆలోచనలను స్మరించుకుంటూ, సామాజిక న్యాయం, సహజీవన సౌహార్ద్రం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉద్బోధించారు. అగ్రసేన్ మహారాజు చూపిన మార్గం దేశాభివృద్ధి, సౌభ్రాతృత్వం, సమానత్వానికి మార్గదర్శకం అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




