బంగాళాఖాతంలో అల్పపీడనం

– తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ ‌తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతూ రాబోయే 24గంటల్లో మరింత బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. గురువారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌, ‌వికారాబాద్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శనివారం వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉం‌దని చెప్పింది. ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ‌జారీ చేసింది.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *