లక్ష్మారెడ్డి మృతి మీడియా సంస్థలకు తీరని లోటు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: ఎన్‌ఎస్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించడానికి గత దశాబ్దాలుగా వేదికైన ఎన్‌ఎస్‌ఎస్‌ ఏజెన్సీ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు, మీడియా సంస్థలకు తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు. కొండా లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *