మూడు దశల్లో పోలింగ్
తెలంగాణలోని రూరల్ స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ) రెండవ సాధారణ ఎన్నికల (2nd Ordinary Elections to Rural Local Bodies) నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (TSEC) నేడు (సెప్టెంబర్ 29, 2025) ప్రెస్ నోట్ విడుదల చేసింది. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30, 2025లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఎన్నికల నోటిఫికేషన్ మరియు షెడ్యూల్ను జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అంగీకారం లభించినట్లు కమిషన్ పేర్కొంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను మూడు దశల్లో ప్రకటించింది.
| 1. | నామినేషన్ల దాఖలు ప్రారంభం |1వ దశ 17.10.2025 (శుక్రవారం) | 2వ దశ 21.10.2025 (మంగళవారం) |3వ దశ 25.10.2025 (శనివారం) |
| 2. | నామినేషన్ల స్వీకరణకు తుది గడువు | 1వ దశ19.10.2025 (ఆదివారం) | 2వ దశ 23.10.2025 (గురువారం) |3వ దశ 27.10.2025 (సోమవారం) |
| 3. | నామినేషన్ల పరిశీలన |1వ దశ 20.10.2025 (సోమవారం) | 2వ దశ 24.10.2025 (శుక్రవారం) | 3వ దశ28.10.2025 (మంగళవారం) |
| 4. | పోటీ నుంచి విరమణకు తుది గడువు | 1వ దశ 23.10.2025 (గురువారం) | 2వ దశ 27.10.2025 (సోమవారం) |3వ దశ 31.10.2025 (శుక్రవారం) |
| 5. | పోలింగ్ తేదీ |1వ దశ 31.10.2025 (శుక్రవారం) |2వ దశ 04.11.2025 (మంగళవారం) |3వ దశ 08.11.2025 (శనివారం) |
| 6. | వోట్ల లెక్కింపు | 1వ దశ31.10.2025 (శుక్రవారం) మ. 2:00 నుండి | 2వ దశ04.11.2025 (మంగళవారం) మ. 2:00 నుండి | 3వ దశ08.11.2025 (శనివారం) మ. 2:00 నుండి |
* ఉప సర్పంచ్ ఎన్నిక: ఫలితాలు ప్రకటించిన అదే రోజున ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించబడుతుంది





