– రెండేళ్ల చిన్నారికి విజయవంతమైన పైలోప్లాస్టి సర్జరీ
హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 17: త్రీడీ ల్యాప్రోస్కోపిక్ సాంకేతికతతో వరంగల్ జిల్లాలోనే తొలిసారిగా రెండేళ్ల చిన్నారి పాపకు కిడ్నీ సంబంధిత పైలోప్లాస్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు హన్మకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వి.వేదాంశి అనే రెండేళ్ల చిన్నారికి కిడ్నీ నుంచి మూత్రాన్ని మూత్రాశయానికి తీసుకెళ్లే నాళం సన్నబడిన సమస్య ఉందని వైద్య పరీక్షల్లో తేలినట్లు చెప్పారు. చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఈ ఆపరేషన్‌కు రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారని, ఆర్థిక భారాన్ని భరించలేక తమ ఆసుపత్రిని సంప్రదించారని డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి వివరించారు. తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక త్రీడీ ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అనంతరం చిన్నారి త్వరితగతిన కోలుకోగా 72 గంటల్లోనే ఇంటికి పంపినట్లు చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ రఫీ, అనస్తీషియా వైద్యుడు డాక్టర్ సామ్రాట్ కీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇటీవల మరో మూడు త్రీడీ ల్యాప్రోస్కోపిక్ కిడ్నీ శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికతతో తక్కువ ఖర్చులో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





