(గతవారం తరువాయి భాగం)
ఫాహ్మిదా రియాజ్తన మొదటి వివాహానికి డివోర్స్ ఇచ్చాక కరాచీ వచ్చిన ఆమె వామపక్షవాది, రాజకీయకార్యకర్త అయిన జాఫర్ అలీని ద్వితీయ వివాహము చేసుకుంది. సొంత పబ్లికేషన్ ఆవాజ్ తో రాజకీయ, సాహిత్యరంగాలలో తనదైన ముద్రవేసింది. జనరల్ జియాఉల్హాక్ నియంతృత్వానికి, మత చాందసానికి వ్యతిరేకంగా గొంతు విప్పింది. జియా పాకిస్థాన్ అంతా స్త్రీలకు బ్లాక్ చాదర్ ధరించడం తప్పని సరి చేసినప్పుడు ఆమె చాదర్ ఔర్ చార్ దీవార్ అనే కవిత రాసింది. ఆ కవితలో జియా ఉల్ హాక్ ప్రభుత్వాన్ని ఎంత గట్టిగా ప్రశ్నించింది అంటే‘ఈ నల్లటి చాదర్ తో నేనేం చేయను/ఒకటికి వంద సార్లు నన్ను దోచుకున్నానేనొక్క లిప్త కూడా బాధపడను/ నా శరీరాన్ని ఈ నల్లటి వస్త్రంతో గుర్తించే ముందు/ఈరాత్రి నన్నొక అసభ్యపదాన్ని ఉచ్చరించనివ్వండి/అసలైన నగ్నశరీరం నా పాలకుడి ఇంట్లోవుంది/ఆ నగ్నఛాయలు నగరమంతా పరచుకున్నాయి/నగరం పాలకుడి నగ్నత్వాన్ని వీక్షిస్తోందిరండి/ ఈ నల్లచాదర్ తీసుకునిఆ నగ్నశరీరం మీద కప్పండి(చాదర్ మరియు నాలు గోడలులో ఒకభాగం)ఈ కవిత వివాదాస్పదం అయింది. జియా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కానీ పాకిస్థాన్ప్రజలు కవితను సొంతం చేసుకున్నారు. చాదర్ కి వ్యతిరేకంగాజరిగిన ప్రతివూరేగింపులోనూ ఈ కవితను వల్లే వల్లెవేయడం మొదలుపెట్టారు.
చాదర్ వలసవాదానికి మగ రూపం అని ఆమెకు బాగా తెలుసు కనుకే ఈ కవితలో అంత డెన్సిటీ తీసుకురాగలిగింది. (మన తెలుగు జయప్రభ పైటను తగలెయ్యాలి మీకు గుర్తుకు వస్తున్నదా?)గాయత్రీ చక్రవర్తి స్పివాక్ మాటల్లో చెప్పాలి అంటే “A knowing in her gendering, that nation and identity are commodities in that strictest sense something made for exchange. And women are the medium, of exchange” ‘బదన్ దరీదా’ పాకిస్థానీ ఫెమినిస్ట్ కవిత్వంలో మొట్టమొదటిసారి స్త్రీ శరీరాన్ని మీడియం అఫ్ ఎక్స్చేంజి కావడానికి వ్యతిరేకంగా గొంతెత్తిన మొదటి పుస్తకం. ఆమెకవిత్వం వెల్లువలా సాహిత్యపత్రికలలో ప్రచురించబడటం, ఆమె వామపక్ష భావజాలం, పాకిస్థానీ పీనల్ కోడ్ 124A కింద ఆమెను దేశద్రోహిగా, భారత ఏజెంట్ గా ప్రభుత్వం ఆరోపించేందుకు, దేశ బహిష్కరణ విధించేందుకు కారణమయింది.ప్రముఖ రచయిత, తన స్నేహితురాలు అమ్రితా ప్రీతమ్ సహాయంతో ఫాహ్మిదా భారత్లో ఎనిమిదేళ్ల పాటు రహస్యజీవితం గడిపింది. పాకిస్థాన్లో జియా ప్రభుత్వం కూలిపోయాక కానీ ఆమె మళ్లీ పాకిస్థాన్ వెళ్ళలేదు. జామియా మిళియ ఇస్లామీయ యూనివర్సిటీఆమెను పొయెట్ ఇన్ రెసిడెన్స్ గానూజవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగానూ పనిచేసింది. ఇక్కడ వున్నప్పుడే సంస్కృతం నేర్చుకుంది. 2018 లో మళ్ళీ ఇండియా సందర్శనకు వచ్చినప్పుడు ఆమె తన ప్రసిద్ద మైన”తుమ్ భీహమ్జైసేనికలే” అన్న కవితచదివి భారతప్రజలను ఆశ్చర్యపరచింది. 2014 లో నరేంద్రమోదీప్రభుత్వం వచ్చిన తరువాత భారత్ లో క్రమేపీ మతతత్వం పెరిగిపోవడం మీద చిన్నచురక ఆ కవిత.
“చివరకు మీరూ మాలాగే తయారయ్యారు/ సో! చివరకు మీరూ అచ్చుమాలాగే తయారయ్యారు/ఇన్నాళ్లు ఇదంతా ఎక్కడ దాచారుబాబూ/తరాలుగా మాచుట్టూ గోడకట్టినమూర్ఖత్వం, బుద్ధిలేనితనం, అజ్ఞానంచివరకు మీ తీరంలోకీ వచ్చిచేరింది కదా/మీకు శుభాకాంక్షలు/మతజెండాను ఎగురవేయడం ద్వారాబహుశా మీరు హిందూమతసామ్రాజ్యం స్థాపిస్తారేమో… మనవిఇకఎంతమాత్రమూ రెండుజాతులు కాదు/చదువునుఅధ్యయనాన్నీ పక్కన పెట్టేయండి/జమిలిగా అజ్ఞానాన్ని ఎలుగెత్తి పాడుదాందారిలో ఎదురయ్యే గుంతలను పట్టించుకోవద్దుకాలాన్ని వెనక్కు తిప్పుదాం/వెనక్కు నడవడంలో నైపుణ్యం సాధించేంత వరకూసాధన చేద్దాం/గతంపై మన ఏకాగ్రతను ఏ ఆధునిక ఆలోచనాచెరపకుండా జాగ్రత్త పడదాం/ఒకప్పుడు భారత దేశం ఎంతగొప్పగా ఉండేదిగడచిన రోజులలో ఇండియా ఎంత ఉన్నతమైన జీవితం గడిపిందిపదేపదేతలచుకుందాం/ ప్రియమిత్రులారా!మేము ఇప్పటికే అక్కడ వున్నాము/మీరూ ఆ నరకకూపంలోకి వచ్చాకమాతో చెప్తారుకదూఎలా జీవితం నడుస్తున్నదో”
ఒకప్పుడు తానుపుట్టిన,తాను కష్టకాలంలో వున్నప్పుడుతనకుఆశ్రయం ఇచ్చినదేశంపైన ఇంత వివాదాస్పదమైన కవిత రాయడం చాలామందిని ఆశ్చర్య పరచింది.
కొన్ని కనుబొమ్మలను పైకెత్తేలా చేసింది. కానీ నాకేదేశమూ లేదు, భాషే నా దేశం. భాషలో నేనొక ప్రపంచాన్ని సృష్టించుకున్నానుఅంటుంది ఫాహ్మిదా రియాజ్.రేమండ్ హేన్రి విలియమ్స్కల్చర్ అండ్ సొసైటీ అన్నపుస్తకంలోసంస్కృతికికొత్తరూ
పాన్ని ఇచ్చాడు. ‘Williamsunderstands ‘culture’ as being made of two separate components; the first denotes a whole way of life, the second refers to the arts and learning. The former component represents the known meanings and directions which its members recognise and respond to, the later represents new observations and meanings which are put forward and tested.] These components are reflected in every human society and render culture ordinary.’ అన్న అవగాహనకు ఫాహ్మిదా రియాజ్ తన సాహిత్య సృజనలో ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చింది. సమకాలీన సమాజాలు విలియమ్స్ చెప్పిన మొత్తం జీవన విధానాన్ని విస్మరిస్తున్న సమయంలో ఫాహ్మిదా రచనలు కొత్తజాగృతిని కలిగిస్తాయి.
వంశీకృష్ణ