ప్రాథమిక సౌకర్యాల కొరత

నాంపల్లిలోని ప్రజా ఉద్యానవనంలో సీనియర్‌ ‌సిటిజన్ల విభాగానికి చెందినవారు నిరసన తెలిపారు. వారు మరుగుదొట్లలు, తాగునీరు, వ్యాయామ సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రక్తపోటు, షుగర్‌, ‌గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు తరచూ ఉద్యానవనానికి వచ్చే వారు ప్రాథమిక సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాదులోని ఇతర పార్కులలో లభిస్తున్న సదుపాయాలను ఇక్కడ కూడా అందించాలంటూ వారు తెలంగాణ ప్రభుత్వం, జిహెచ్‌ఎం‌సీ మరియు హెచ్‌ఎంఎడబ్ల్యుఎస్‌ఎస్‌బీ అధికారులను కోరారు. గౌరవమైన జీవితం కోసం ఈ మౌలిక సదుపాయాలు అవసరమని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *