మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: అనేక మానసిక సమస్యలను తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకునే పరిస్థితి లేదని, అయితే మానసిక నిపుణులు, మానసిక వైద్యుల సహకారంతో సాంత్వన పొందే అవకాశం కలుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు. దీనిపై ఉన్న వ్యతిరేక భావన మారాల్సిన అవసరం ఉందన్నారు. గచ్చిబౌలిలో అమృత సంకల్ప్ క్లినిక్ (మెంటల్ వెల్నెస్ క్లినిక్)ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒక మంచి ఆలోచనతో డాక్టర్ సురేంద్ర, శిరీష, విజయలక్ష్మి కలిసి ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారని, వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఉన్న జీవనశైలి వల్ల శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యమైనదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. శారీరక బాధలు మాత్రమే కాకుండా మానసిక రుగ్మతలు, సమస్యల విషయంలో కూడా ప్రజలు అవసరమైన వైద్యుల సహాయాన్ని పొందాల్సిన అవసరం ఉందనా ్నరు. ఇలాంటి సందర్భంలో ఈ తరహా సౌకర్యాలు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మానసిక సమస్యల కారణంగా చాలామంది ఆత్మహత్య లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రాణం కోల్పోవడం కంటే మానసిక చికిత్స తీసుకోవడం ఎంతో సులభమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఉదోబధించారు. దేశంలో అనేకమందిని బాధిస్తున్న షుగర్ వ్యాధికి ప్రధాన కారణం ఒత్తిడి అనే విషయం చాలామందికి తెలియదని, ఈ తరహా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఇలాంటి క్లినిక్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని కేటీఆర్ చెప్పారు.





