రెండేళ్లు గడిచినా హామీల అమలులో నిర్లక్ష్యం

– కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపాటు
– బీఆర్‌ఎస్‌ ‌డైరీని ఆవిష్కరించిన కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో వోటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లుగా  రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు.. తిరోగమనం వైపు ప్రయనిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నూతన సంవత్సర డైరీని తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్‌ ‌ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర‌ ప్రజలకు, భారత దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026 నూతన సంవత్సర సందర్భంగా భావోద్వేగభరిత ప్రసంగం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందున్న పరిస్థితులు, కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందున్న దుస్థితి రాష్టాన్రికి తిరిగి వస్తోందని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ముఖ్యంగా నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలి కాలంలో కూడా గంటలతరబడి, దినాల తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్‌ ‌పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ కేంద్రంతోనూ సమైక్యవాదులతోనూ 14 ఏళ్లు కేసీఆర్‌ ‌నాయకత్వంలో సాగిన పోరాటాన్ని స్మరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప‌దేళ్ల‌పాటు కేసీఆర్‌ ‌పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని కేటీఆర్‌ ‌కొనియాడారు. జెండాను చేతబట్టి నడిపించే నాయకుల కంటే ఆ జెండాను భూమిలో నిటారుగా పాతి ఇది నా జెండా‘అని గర్వంగా చెప్పే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి పోరాటం వరకు లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా, రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేసిన తీరుకు వ్యతిరేకంగా, రైతుబంధును రెండుసార్లు ఎగ్గొట్టిన అన్యాయంపై, ’ఆరు గ్యారంటీలు, 420 హామీలు’పై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కార్యకర్తలను కేటీఆర్‌ అభినందించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గళమెత్తిన సోదరులను, హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో భూముల ఆక్రమణను అడ్డుకున్న‌ విద్యార్థులను, ప్రతి అన్యాయానికి ఎదురు నిలుస్తున్న తమ్ముళ్లను, ఆడబిడ్డలను ఆయన ప్రత్యేకంగా స్మరించారు. 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో ఒకటే విషయం గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. గెలుటములు శాశ్వతం కావని, అవి తాత్కాలికమని, అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయని, కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్‌ ‌స్థానం, గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతమని స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆటలా ఉంటే, తెలంగాణ సాధించిన బీఆర్‌ఎస్‌కు రాజకీయాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన ధర్మమని, ఒక విధి అని కేటీఆర్‌ ‌తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ప్రయాణం నిరంతరం కొనసాగాలన్నారు. ఈ ఏడాది ఒక వైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే, మరో వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా అవసరమని స్పష్టం చేశారు. పోరాటం, నిర్మాణం రెండింటినీ ఆధారంగా చేసుకుని ముందుకు సాగాలని, ధర్మం, న్యాయం, నిజాయతీ తమవైపే ఉన్నాయని, అందుకే విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రంలోని రెండు పార్టీలు ఒకటై బీఆర్‌ఎస్‌పై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని కేటీఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా బీఆర్‌ఎస్‌ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. 2028లో తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్‌ఎస్‌ ‌లక్ష్యమని, అదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *