సురేఖ ఓఎస్టీ గురించి తెలియదు

– మా కుమార్తె ఏం మాట్లాడిందో కూడా తెలియదు
– కాంగ్రెస్‌ ‌నేత కొండా మురళి

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: ‌మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ ‌విషయం తనకు తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్‌ ‌నేత కొండా మురళి అన్నారు. తన కుమార్తె సుస్మిత హైదరాబాద్‌లో ఏం మాట్లాడిందో తెలియదన్నారు. స్మార్ట్ ‌ఫోన్‌ ‌చూడటం తనకు రాదని చెప్పారు. సిమెంట్‌ ‌కంపెనీ యాజమాన్యాలను సుమంత్‌ ‌బెదిరించినట్లు వొచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఓఎస్డీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి సురేఖ ఇంటి వద్దకు సుమంత్‌ ‌కోసం పోలీసులు రావడం.. మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో హనుమకొండలో కొండా మురళి మీడియాతో మాట్లాడారు. నా కుమార్తె, అల్లుడు లండన్‌లో ఉన్నారు.. అక్కడ వ్యాపారం చేస్తున్నారు. నా బిడ్డకు ఏ పదవి లేదు.. ఆమె ఏ పార్టీలోనూ లేదు. మంత్రి ఛాంబర్‌కు ఇప్పటివరకు నేను వెళ్లలేదు. భద్రతా కారణాల వల్ల వేర్వేరు కార్లలో నేను, సురేఖ వెళ్తాం. సీఎం రేవంత్‌రెడ్డి నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు.. ఇస్తారు. ఆయన సీఎం కావాలని కోరుకున్న వారిలో నేనూ ఒకడిని. సీఎం, మంత్రి పొంగులేటి మా ఇంటికి వచ్చారు.. నన్నెందుకు టార్గెట్‌ ‌చేస్తారని మురళి వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *