– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: విజయ దశమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం అని అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటు మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుందన్నారు. రామాయణ మూలసూత్రాలను, అందులో దాగున్న విలువలను సమాజానికి బోధించేది దసరా పండగ అని, ప్రపంచం, సమాజం, కుటుంబం వంటి విషయాలపై మన కర్తవ్యాన్ని, మనుషుల మధ్య పరస్పర సంబంధాలు, మర్యాదలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. దీనికితోడు దసరా పండగ ప్రపంచానికి స్త్రీ శక్తిని చాటుతుందని, మహిళలు దుర్గాదేవి అవతారం.. వారిని గౌరవించుకోవడంతోపాటు సమాజంలో వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన స్ఫూర్తిని చాటేది దసరా పండగ అని కిషన్‌రెడ్డి తెలిపారు.ఈ పండగ మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానన్నారు.
—————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



