హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమై,కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర,కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సమాజాల సబ్బండ కులాల సంస్కృతి సాంప్రదాయాలకు పదేండ్ల బీఆర్ఎస్ పాలన పెద్దపీట వేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరిలోయ పరీవాహక ప్రగతితో సమాంతరం గా సాగిన ఆధ్యాత్మిక అభివృద్ధిని, ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని, ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మ దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





