బీఆర్ఎస్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసింది

– రేవంత్ కు కూల‌గొట్టుడు త‌ప్ప క‌ట్టుడు లేదు
– గ‌రీబోళ్ల ఇళ్ల‌ను కూల‌గొడ్త‌డు
– బ‌డా బాబుల జోలికి పోడు
– దేవాల‌యాల‌ను కూల‌గొడ్త‌నంట‌డు
– బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు

కొల్లూరు, ప్ర‌జాతంత్ర‌, మార్చి 11: గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతోంది.. ప్రపంచ‌మంతా ఆందోళనలో ఉంది..  గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.. రంజాన్ మాసంలో అల్లాను వేడుకోండి యుద్ధం ముగియాలని అని బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు బుధ‌వారం ఇఫ్తార్ విందులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో దావత్ ఏ ఇఫ్తార్ ఇచ్చారు. రంజాన్ తోఫా ఇచ్చారు. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పోలీస్ ఉద్యోగాల్లో పురుషులు మాత్రమే ఉండేది కానీ కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఆడపిల్లల కోసం మహిళా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చి ఆసరా అయ్యారు అని వివ‌రించారు. కాంగ్రెస్ నేత‌లు ఎన్నిక‌ల‌పుడు తులం బంగారం ఇస్తాం అన్నారు ..తులం లేదు.. పావు లేదు. అక్కచెల్లెళ్ళకు కోరుతున్నా.. ఇంట్లో ఆడపిల్లను మంచిగ చదివించండి. ఉన్నతమైన చదువులు చదివితే ఉన్నత స్థానంలో ఉంటారు. మగ పిల్లలకు సమానంగా ఆడపిల్లలను చూడాలి. మహిళలు బాగా చదువుకోవాలి.. మహిళలు స్వయం సమృద్ధి చెందాలి అని కేసీఆర్ అనేక మహిళా సంక్షేమ పథకాలు అమలు చేశారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా రిజర్వేషన్లు రాబోతున్నాయి. కేసీఆర్ శాసనసభలోనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానం చేశారు. మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి. చట్ట సభల్లో సగ భాగం మహిళలు వస్తారు. కేసీఆర్ 150 ఎకరాలు ఇచ్చాడు అని మహిపాల్ అన్న అన్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఉన్నది అమ్మేవాడు అని నేను అన్నాను. రేవంత్ రెడ్డి వచ్చాక కూల్చుడు తప్ప ఒక్క ఇల్లు కట్టుడు లేదు. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుంటాడు. ఫ్యూచర్ సిటీని ఫార్మా సిటీ అని మేము అంటే ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు.. మూ సీ అంటాడు.. పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టాడు. ఖమ్మంలో సైతం 900 ఇండ్లు కూలగొట్టాడు. కూలగొట్టుడు ఎందుకు కట్టుడు ఎందుకు. ఇండ్లు కూలకొడితే వాళ్ళు ఏడిస్తే పోలీసులు కూడా ఏడ్చారు. బీఆర్ఎస్ పోరాటం చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇండ్లు కట్టిస్తాం అంటున్నాడు. పారిశ్రామిక భూముల మీద పడ్డాడు. కేసీఆర్ ఉంటే ఇచ్చాడు.. కానీ రేవంత్ రెడ్డి అయితే అమ్ముకునేవాడు. దీనికి కూడా రూ.5000కోట్లు వస్తాయని అనుకునేవాడు. ఇప్పుడు గుడులు కూలగొడుతున్నాడు. శ్యామల దేవి అమ్మవారి ఆలయం కూడా కులకొడుతుండు అని పోలీసులు కూడా పోయారు. పొద్దున నేను పోయి ఎట్లా కులకొడుతవు అని నిలదీస్తే వెనుకకు తగ్గాడు. గ‌రీబోళ్ల‌ ఇండ్లు కూల్చాడు తప్ప తన తమ్ముని ఇల్లు మాత్రం కూలగొట్టలేదు. మీ దగ్గర రూపాయి తీసుకోకుండా ఇక్కడ ఇల్లు ఇచ్చాడు కేసీఆర్. శాసనసభలో మీ కొల్లూరు డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యలు లేవనెత్తుతం. ఎవడు వచ్చి ఇండ్లు గుంజుకుంటాడు? సర్వే చేస్తున్నారు అంటే భయపడకండి. మీకు అండగా ఉంటాం. కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు గుంజుకోవడానికి ఎవని హక్కు లేదు. మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంహ‌రీష్‌రావు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *