పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి

– భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులపై కేసీఆర్‌ ఆందోళన

– కేటీఆర్‌కు దిశానిర్దేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో గురువారం ఆయన మాట్లాడారు. తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ను ఆదేశించారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల కేసీఆర్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలకు అధినేత ఫోన్లు చేసి ు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమవంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కేసీఆర్‌ సూచించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *