ఎమ్మెల్యే హరీష్‌ ‌రావుకు కవిత దంపతుల పరామర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్తతో కలసి వెళ్లి హరీష్‌ ‌రావును పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే మూడు రోజుల తర్వాత, గురువారం ఉదయం కవిత హరీష్‌రావు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు.  సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *