– ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ అరెస్ట్
కర్నూలు, నవంబరు 7: తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వి.కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను ఎ1 నిందితుడిగా ఇప్పటికే అరెస్టు చేయగా, ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్‌ను ఎ2 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రావెల్స్ ఓనర్ వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు వినోద్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు కర్నూలు జిల్లా, ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద ఒక బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. పోలీసుల ఈఎఖీ కాపీ ప్రకారం డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశారు. డ్రైవర్‌తో పాటు ఓనర్‌పై ఉలిందకొండ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





