‘దివ్యదృష్టి’ బృందానికి ప్ర‌శంస‌ల వెల్లువ‌

  • విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్షల సంగీత వాయిద్యాల మంజూరు
  • గ్రానైట్ అసోసియేషన్ విద్యార్థులకు నగదు, బహుమతులు అందజేత
  • ఫిలిం సొసైటీ, సాహితి గౌతమి ఆధ్వర్యంలో ఘన సత్కారం

కరీంనగర్, ప్ర‌జాతంత్ర : కరీంనగర్ ఫిలిం భవన్‌లో ‘దివ్యదృష్టి(Divya Drishti )’ బృందానికి ఘన సన్మానం జరిగింది. విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్షల రూపాయల సంగీత వాయిద్యాలను మంజూరు చేశారు. ఈనేప‌థ్యంలో అద్భుతంగా పాటలు పాడిన దివ్య దృష్టి బృందాన్నీ కరీంనగర్ ఫిలిం సొసైటీ, కరీంనగర్ సాహితి గౌతమి ఆధ్వర్యంలో శుక్ర‌వారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై దివ్య దృష్టి బృందానికి దసరా పండుగ సందర్భంగా కొత్త‌ దుస్తులు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెలికి తీయాలని వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు. కరీంనగర్ దివ్యదృష్టి బృందం విద్యార్థులు అద్భుతంగా తన స్వరాన్ని వినిపించి కరీంనగర్ జిల్లా పేరును రాష్ట్రము దేశస్థాయికి తీసుకెళ్లడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో తాను ప్రధాన పాత్ర పోషించడం తన పూర్వజన్మ సుకృతమ‌ని అన్నారు. దివ్యదృష్టి విద్యార్థులకు తాను మంచి మిత్రురాలు కావడం ఎంతో గొప్పతనం అని దానికంటే సాధించేది ఏమీ ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. దివ్య దృష్టి విద్యార్థులు మరిన్ని మంచి పాటలు పాడుతూ తమ స్వరానికి పదును పెడుతూ పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు. ఏ పనైనా కష్టపడి చేస్తే దానికి సార్ధకత ఉంటుందని ఇందులో భాగంగానే దివ్యదృష్టి విద్యార్థులు సప్త స్వరాలు చాలా బాగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన వారందరికీ పేరుపేరునా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇందులో ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర నంది శ్రీనివాసు కేబి శర్మతో పాటు ఇతరుల పాత్ర కీలకంగా ఉందన్నారు. పిల్లల్లో పెద్దపెద్ద ఆశలు లక్ష్యాలు ఉంటాయని వాటిని సహకారం చేసేందుకు మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. దివ్యదృష్టి విద్యార్థుల ప్రతిభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రముగ్ధులయ్యారని, వారి ప్రతిభను మెచ్చుకున్నారని కలెక్టర్ తెలిపారు. వారి ప్రతిభాను గుర్తించి ఐదు లక్షల సంగీత వాయిద్యాలను మంజూరు చేశారని చెప్పారు. దివ్యదృష్టి విద్యార్థులు హైదరాబాదులో పలు ప్రాంతాలకు తీసుకెళ్లామని తెలిపారు. అదేవిధంగా కరీంనగర్ గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు 16 మంది దివ్య దృష్టి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున నగదు అందజేశారు. అలాగే గ్రానైట్ క్వారీ అసోసియేషన్ ప్రతినిధులు బ్యాగులు అందించారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ కోశాధికారి అనిల్ దివ్య దృష్టి విద్యార్థులకు హాట్ బాక్సులు అందజేశారు. జాయింట్ సెక్రెటరీ కొమురవెల్లి వెంకటేశం రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కరీంనగర్ ఫిలిం సొసైటీ, సాహితీ గౌతమి ప్రతినిధులు దివ్యదృష్టి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ను సైతం సన్మానించారు. దివ్యదృష్టి విద్యార్థుల వీడియో ఆల్బమ్ లో భాగస్వాములైన వారిని జిల్లా కలెక్టర్ సత్కరించారు. దివ్యదృష్టి విద్యార్థులు వీడియో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఫిలిం సొసైటీ ప్రతినిధులు సాహితీ గౌతమి ప్రతినిధులు కవులు కళాకారులు తల్లిదండ్రులు వీక్షించారు.

కార్యక్రమంలో కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గౌతమ్ సాహితి గౌతమ్ అధ్యక్షులు నంది శ్రీనివాసు ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ కుమార్ సంగీత విద్వాంసులు కేబీ శర్మ జర్నలిస్టు సెన్సార్ బోర్డు మెంబర్ నవీన్ కుమార్ అన్నవరం దేవేందర్ మ్యూజిక్ టీచర్ సరళ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *