– మహబూబ్‌నగర్ పర్యటనలో రామచందర్‌రావు
మహబూబ్‌నగర్, జులై 26: మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుకు బాలానగర్‌లో కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. మార్గంమధ్యలో తిమ్మాపూర్ పాలమాకులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత ఆర్మీ మాజీ జవాన్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ వారిని సత్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రతి బీజేవైఎం కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బాలానగర్‌లో స్వాగతం పలికిన వారిలో ఎంపీ డి.కె.అరుణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, శాంతికుమార్, మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


