కంచగచ్చబౌలి భూములపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,జూన్‌23(ఆర్‌ఎన్‌ఎ): కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను సీజే ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములను గతంలో టీజీఐఐసీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈక్రమంలో భూములను జేసీబీలతో చదును చేసింది. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వేర్వేరుగా 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాదనల సందర్భంగా.. టీజీఐఐసీకి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో.. హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *