కామారెడ్డి, ప్రజాతంత్ర : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మత్తడి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాగా కామారెడ్డి (kamareddy) జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది. జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుతో నిండిపోయింది. అనేక కాలనీలో జలమయమై కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీరు చేరడంతో అక్కడివారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడు చూడని విధంగా భూమికి సమాంతరంగా పెద్ద చెరువు నీళ్లు పారుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద చెరువుకు ఆనుకుని ఉన్న కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
#Telangana #telanganarains #TelanganaNews #Rainalerts
కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం
కామారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలు వినాయక చవితి పండుగ పూట తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. For more details please login… pic.twitter.com/Kleub7NRy1— Prajatantra (@ADevulapalli) August 27, 2025
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ లో వరదల్లో చిక్కుకున్న వారిని పోలీసులు, SDRF సిబ్బంది భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అప్పర్ మానేర్ వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేశారు. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు కామారెడ్డి, MDKలలో 504 మందిని రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




