దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్‌ ‌

కెసిఆర్‌ ‌తదితరులకు నోటీసులు
– జూన్‌ 5‌న విచారణకు రావాలిన ఆదేశం
– 6న హరీష్‌ ‌రావు, 9న ఈటల హాజరుకు నోటీస్లు

కాళేశ్వరం కమిషన్‌ ‌దూకుడు పెంచిందిఇంతకాలం అధికారులను విచారించిన కమిషన్‌ ఇప్పు‌డు ఇందులో కీలకంగా ఉన్ననేతలను విచారణకు పిలుస్తోందిఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేతమాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నోటీసులు ఇచ్చిందిఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్‌రావుబీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కూ నోటీసులు జారీ చేసింది15 రోజుల్లో కమిషన్‌ ఎదుట హాజరుకావాలని కోరిందికాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌విచారణ జరుపుతున్న విషయం తెలిసిందేకేసీఆర్‌ ‌సీఎంగా ఉన్న సమయంలో హరీష్‌ ‌రావు నీటిపారుదల శాఖ మంత్రిఈటల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారుఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్‌ ‌నోటీసులు జారీ చేసిందికేసీఆర్‌ ‌జూన్‌ 5‌హరీష్‌ ‌రావు జూన్‌ 6‌ఈటల రాజేందర్‌ ‌జూన్‌ 9‌న విచారణకు హాజరుకావాలని కోరిందిమేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతోపాటు అన్నారంసుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్‌.. ‌నిర్మాణంనిర్వహణడిజైన్‌‌క్వాలిటీకంట్రోల్‌‌పే అండ్‌ ఎకౌంట్స్‌నీటిపారుదలఆర్థిక శాఖల ఉన్నతాధికారులునిర్మాణసంస్థల ప్రతినిధులు… ఇలా అందరినీ విచారించిందిఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్‌ ‌గడువును పొడిగించిందిగత నెలాఖరులో ఒక నెల మాత్రమే గడువు పొడిగించిందిదీనిప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్‌ ‌గడువు పూర్తికావాలిఈ నెల 21న లేదా 22న జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారన్న‌ ప్రచారం జరిగిందిఅయితే విచారణలో.. సీనియర్‌ ఇం‌జినీర్లుఅధికారుల్లో ఎక్కువమంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయనిఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలను అమలుచేశామని చెప్పిన నేపథ్యంలో.. వీటిపై కేసీఆర్‌‌హరీష్‌ ‌రావుఈటల రాజేందర్‌ల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారంకాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం నిర్మాణం వ్యవహారం లో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది

దాదాపు ఏడాదిన్నరగా కమిషన్‌ ‌విచారణ కొనసాగుతోందికమిషన్‌ ‌విచారణ గడువు ఈ నెలాఖరితో ముగియనుందిఅయితే కమిషన్‌ ‌గడువును ప్రభుత్వం మరో రెండు నెలలపాటు అంటే జూలై 31 వరకు పొడిగిచిందికమిషన్‌ ‌విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలుడీఈలుఎస్‌ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్‌ ‌విచారించిందివారి నుంచి అఫిడవిట్లరూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి.. వాటిని క్రాస్‌ ఎగ్జామిన్‌ ‌చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది.  ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించిందిఅలాగే ప్రాజెక్ట్ ‌డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్‌ ‌విచారణ చేసిందిఈ ఏడాది పాటు సుదీర్ఘంగా జరిపిన ఈ విచారణలో దాదాపు అందరూ కూడా కేసీఆర్‌ ‌పేరే చెప్పినట్లు తెలుస్తోందిబ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారని వేసిన ప్ర‌శ్న‌కు  అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేరునే ప్రస్తావించినట్లు సమాచారం

స్థలాల ఎంపికబ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలుచెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్‌అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రమేయంతో జరిగినట్లు జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోందిఅలాగే కాళేశ్వరం కమిషన్‌ ‌విచారణ దాదాపు తుది దశకు చేరుకుందిఇప్పటి వరకు వచ్చిన వివరాలతో ఓ నివేదికను కూడా సిద్ధం చేసిందిఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ‌చేయకుండా నివేదిక ఇస్తే బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని భావించిన కమిషన్‌.. ‌కేసీఆర్‌ను స్వయంగా విచారించాలని నిర్ణయించిందిఅందులో భాగంగానే కేసీఆర్‌ ‌సహా హరీష్‌ఈటలకు నోటీసులు పంపించిందిఅయితే కమిషన్‌ ‌విచారణకు కేసీఆర్‌ ‌హాజరవుతారా లేక న్యాయపరంగా ఎదుర్కొంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *