హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టూరిజం, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం శాఖ ఎండీ వల్లూరి క్రాంతి మంగళవారం మర్యాపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్నగర్ మైదానంలో మంగళవారం నిర్వహించిన మెగా బతుకమ్మ కార్యక్రమం దిగ్విజయంగా జరిగి గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన విషయం విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారు కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





