– 139 డ్రోన్లతో పోలింగ్ బూత్‌ల పర్యవేక్షణ
– స్థానికేతరులైన ప్రజాప్రతినిధులపై కేసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరన 11: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 32 శాతం పోలింగ్ నమోదైంది. ఎల్లారెడ్డిగూడలోని పడాల రామిరెడ్డి లా కాలేజీలో అత్యధికంగా ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా ఈ ఉప ఎన్నికలో పోలింగ్ బూత్‌ల పర్యవేక్షణకు 139 డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉండగా డివిజన్‌ల వారీగా ఓట్ల సంఖ్య, పోలింగ్ బూత్‌ల సంఖ్య ఇలా ఉంది. రహమత్ నగర్ డివిజన్‌లో 70,583 ఓట్లు ఉండగా 72 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.
షేక్ పేటలో 70,546 ఓట్లు.. 70 పోలింగ్ బూత్‌లు. ఎర్రగడ్డలో 59,580 ఓట్లు.. 63 పోలింగ్ బూత్‌లు. యూసఫ్‌గూడ డివిజన్‌లో 58,599 ఓట్లు.. 56 పోలింగ్ బూత్‌లు. వెంగళరావు నగర్‌లో 54,620 ఓట్లు.. 58 పోలింగ్ బూత్‌లు, బోరబండలో 52,754 ఓట్లు.. 50 పోలింగ్ బూత్‌లు, సోమాజిగూడలో 32,300 ఓట్లు.. 38 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం అధికారులు కేసులు పెట్టారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనధికారికంగా పోలింగన బూత్‌ల వద్ద ఉన్నారని, వారిని గుర్తించామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





