జూబ్లీహిల్స్ ‌బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ ‌రెడ్డి

– ఖరారు చేసిన పార్టీ అధిష్టానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ‌జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీపక్‌రెడ్డి 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ‌బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గంలోని పలువురు సీనియర్ల పేర్లను బీజేపీ పరిగణనలోకి తీసుకుంది. అందుకు సంబంధించిన జాబితాను రూపొందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూదిల్లీ తీసుకు వెళ్లి అధిష్టానం ముందు ఉంచారు. అధిష్టానం లంకల దీపక్‌ ‌రెడ్డిని ఎంపిక చేసింది. ఇప్పటికే కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం నామినేషన్‌ ‌దాఖలు చేశారు. మరోవైపు అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *