10న ఫార్మసిస్ట్‌ పోస్టులకు జాబ్‌ మేళా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 7: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్‌ ఫార్మసీ ఈ నెల 10న ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తారు. మెడ్‌ప్లస్‌ ఫార్మసీలో ఫార్మసిస్టు, అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌కు చెందిన వంద పోస్టులను ఈ జాబ్‌ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిగ్రీ చేసిన యువతీయువకులు 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్‌ఫÛర్మేషన్‌ బ్యూరో డిప్యూటీ చీఫ్‌(UEI &GB/MCC) ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.12,000 నుండి రూ.25,000 వేల వరకు వేతనం ఉండే ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు సాయి శైలేష్‌, హెచ్‌ఆర్‌ ఫోన్‌ 9666662481ను సంప్రదించాలని కోరారు. అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ బ్యూరో(UEI &GB/MCC) వద్ద పదో తేదీన హాజరు కావాలని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *