20న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఈ నెల 20న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టులకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఏదైనా డిగ్రీ చేసిన యువతీయువకులకు1 8 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్(యూఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.16,383 నుండి రూ.19,769 వేల వరకు వేతనం ఉండే ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు టి.రఘుపతి, హెచఆర్ ఫోన్ నం.8247656356ను సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద నేరుగా 20వ తేదీన హాజరు కావాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *