‌ప్రేమించే గుణాన్ని పంచిన ఏసు ప్రభువు

– క్రిస్మస్‌ ‌వేడుకల్లో సిఎం రేవంత్‌
– ఆజ్మీర్‌ ‌దర్గాకు సిఎం ఛాదర్‌ ‌సమర్పణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్‌ ‌వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగగా క్రిస్మస్‌.. ‌ద్వేషించే వారికి కూడా ప్రేమించే గుణాన్ని ఏసు ప్రభువు మానవాళికి స్ఫూర్తిగా అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా డిసెంబర్‌ ఒక మిరాకిల్‌ ‌మంత్‌గా మారిందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి, ఆంధప్రదేశ్‌లో పార్టీకి నష్టం జరిగినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారని సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. అయితే, గతంలో సోనియా గాంధీ ఫుడ్‌ ‌సెక్యూరిటీ యాక్ట్‌ను తీసుకొచ్చి పేదలకు భరోసా కల్పించారని సీఎం రేవంత్‌ ‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈరోజు తెలంగాణలో తమ ప్రభుత్వం పేదలకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. అలాగే, విద్య, వైద్యం లాంటి కీలక సేవలను ప్రభుత్వంతో సమానంగా క్రిస్టియన్‌ ‌మిషనరీలు కూడా పేదలకు అందిస్తూ, సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. క్రిస్మస్‌ ‌పండుగ ప్రేమ, సేవ, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది.. ఆ విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇదిలావుంటే అజ్మీర్‌ ‌షరీఫ్‌ ‌దర్గాకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చాదర్‌ ‌సమర్పించారు. ఈ క్రాయక్రమంలో మంత్రులు అజారుద్దీన్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, వేం నరేందర్‌ ‌రెడ్డి,ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు, ఫహీం ఖురేషీ, తెలంగాణ హజ్‌ ‌కమిటీ చైర్మన్‌ అప్జల్‌ ‌బియాబని, వక్ఫ్ ‌బోర్డు చైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ‌ముస్లిం మైనారిటీ నేతలు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *