కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి

హైదరాబాద్‌ ‌నూతన ఆవిష్కరణలకు కేంద్రం
•ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు

హైదరాబాద్‌, ‌ప్రజాతంంత్ర, ఫిబ్రవరి 27 : అన్ని రంగాల్లో నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేయడమే మా లక్ష్యమని,  ఆ దిశగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తుందని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు అన్నారు.  అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్‌ ‌యూనివర్సిటీ నీ ఏర్పాటు చేశాం. ఆనంద్‌ ‌మహీంద్రా లాంటి ప్రముఖులను ఈ యూనివర్సిటీ నిర్వ హణలో భాగస్వామ్యం చేశాం. పరిశ్రమల అవసరాలకు అనుగు ణంగా కోర్సులను రూపొందిస్తూ… పరి శ్రమలకు అవ• •రమైన స్కిల్డ్ ‌వర్క్ ‌ఫోర్స్ ‌ను అందిస్తున్నామని,   స్కిల్లింగ్‌, ‌రీ స్కిల్లింగ్‌, అప్‌ ‌స్కిల్లింగ్‌ ‌కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్‌ ‌యూనివర్సిటీ నిర్వహణలో హెచ్‌ ‌సీఎల్‌ ‌టెక్నాలజీస్‌ ‌కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.
తెలంగాణను ట్రిలియన్‌ ‌డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలన్నది మా లక్ష్యం. ఇది అంత తేలికైన విషయం కాదు. కానీ… మేం చిత్తశుద్ధితో కృషి చేసి… ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ లక్ష్య సాధనలో ఐటీ రంగం కీలక పాత్ర పోషించాలని కోరుతున్నా. ఐటీ పరిశ్రమలు సాంప్రదాయబద్ధంగా కాకుండా ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేలా కొత్తగా ఆలోచించాల్సిన అవసరముంది. గ్లోబల్‌ ‌కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను గ్లోబల్‌ ‌వాల్యూ సెంటర్లు మార్చుతాం. వీటిల్లో తెలంగాణ యువత అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు దక్కించుకునేలా వారిని తీర్చి దిద్దుతాం.  ఎఐ, మెషీన్‌ ‌లెర్నింగ్‌, ‌క్వాంటం కంప్యూటింగ్‌ ‌తదితర ఎమర్జింగ్‌ ‌టెక్నాలజీస్‌ ‌లో తెలంగాణ ను హబ్‌ ‌గా మారుస్తాం. ఈ టెక్నాలజీస్‌ ‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం.
త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌ ‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్ ‌లెన్స్ ‌ను ప్రారంభించబోతున్నాము. ఇందుకోసం ఇప్పటికే స్విట్జర్లాండ్‌ ‌కి చెందిన దిగ్గజ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.  కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందింది. ఇందుకు 1992 లోనే పునాది పడింది. అప్పట్లో ఏర్పాటు చేసిన సాప్ట్ ‌వేర్‌ ‌టెక్నాలజీ పార్క్ ఐటీ రంగం అభివృద్ధి కి మార్గ నిర్దేశనం చేసింది. ఈ స్ఫూర్తితో హైదరాబాద్‌ ‌ను ఐటీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తాం. హైదరాబాద్‌ ‌నూతన ఆవిష్కరణలకు హబ్‌ ‌గా మారింది. ఇటీవలి కాలంలో ఇక్కడి నుంచి 15 పేటెంట్స్ ‌రావడం సంతోషకరం. యావత్తు ప్రపంచం టెక్నాలజీ అంటేనే హైదరాబాద్‌ ‌వైపు చూసేలా చేస్తాం. హెచ్‌ ‌సీ ఎల్‌ ‌టెక్నాలజీస్‌ ‌సాధించిన ప్రగతి తెలంగాణ కు గర్వకారణమని,  ఈ నూతన క్యాంపస్‌ ‌ద్వారా కొత్తగా 5వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని మంత్రి శ్రీధర్‌ ‌బాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *