పేదలను ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు

– రాజకీయాలకతీతంగా ‘మల్కాజిగిరి’ అభివృద్ధి
– నల్ల చెరువును ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లికి రావడం సంతోషంగా ఉందంటూ రాజకీయాలÅ£తీతంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ విధానమన్నారు. కూకట్‌పల్లిలో హైడ్రా పునరుద్ధరించిన నల్ల చెరువును సోమవారం సాయంత్రం ఆయ‌న‌ ప్రారంభించి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్‌ను సందర్శించారు. చెరువులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు ఎంతమంది ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా మౌనంగా భరించామని, నల్ల చెరువు అభివృద్ధిని చూశాక ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూస్తే తనకు ఆ విమర్శలు ఆశీర్వాదంగా మారాయనిపిస్తోందని అన్నారు. పేదవాడిని ఇబ్బందిపెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, వరదలు వచ్చినపుడు ముంపు బాధితులుగా మిగలకూడదనేది తమ తపన అని రేవంత్‌ స్పష్టం చేశారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి సూచించేదొక‌టే.. మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తాం.. చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది..  మహా నగరాలు సమస్యలతో సతమతమవుతున్నందున మన నగరంలో ప్రకృతిని కాపాడుకుని చెరువులను పునరుద్ధరించుకుందాం.. మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం.. కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న చెరువులన్నీ పునరుద్ధరించుకుందాం.. నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం.. రోడ్ల విస్తరణ చేపడదాం.. ఒక మంచి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుకుందాం అని చెప్పారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.. అభివృద్ధిని అడ్డుకోకండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అభివృద్ధి చేసుకోలేం.. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే తల తాకట్టు పెట్టి అయినా నిధులు ఇచ్చే బాధ్యత తనది అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కష్ట కాలంలో ఈ ప్రాంత ప్రజలు నన్ను నిలబెట్టారు.  మీ కోసం అభివృద్ధి చేయడానికి వెనకాడను.. మీ సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతా అని హామీ ఇచ్చారు.. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ నవీన్ రావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పోలీసు అధికారుల పీపీటీ

రిట్రీట్- 2026లో భాగంగా విభాగాల వారీగా వివిధ అంశాలను పోలీస్ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. భవిష్యత్తులో పోలీసింగ్‌లో తీసుకురావాల్సిన మార్పులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన పలు సూచనలు చేశారు. సాంకేతిక పెరుగుతుండడంతో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని, నేరాలను నిరోధించడానికి, నేరస్థులను త్వరగా గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనించి డ్రగ్స్ బాధితులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేలా కౌన్సెలర్స్‌ను నియమించే అంశాలను పరిశీలించాలని కూడా సీఎం సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *