లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

-‌ పది నిమిషాల వ్యవధిలో వంద ఎయిర్‌ ‌స్ట్రయిక్స్

‌టెలి అవీవ్‌, ఏ‌ప్రిల్‌ 8: ‌లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ ‌భీతావహ దాడులకు పాల్పడింది. 10నిమిషాల వ్యవధిలో లెబనాన్‌ ‌లోని పలు ప్రదేశాలపై 100 ఎయిర్‌ ‌స్టయ్రిక్స్ ‌చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు  తెలుస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో అంబులెన్సులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు కొనసాగి స్తున్నట్లు రెడ్‌‌క్రాస్‌ ‌వెల్లడించింది. క్షతగాత్రులతో లెబనాన్‌లోని అన్ని హాస్పిటల్‌లు నిండిపోయాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడి అని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో లెబనాన్‌లో ప్రముఖ మతపెద్ద సాధిక్‌ అలీ నబుల్సీ మృతి చెందారు. బీరుట్‌ ‌సహా పలు ప్రాంతాల్లోని హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ ‌సైన్యం ప్రకటించింది. తమ దేశంపై దాడులు చేయడానికి హెజ్‌బొల్లా ఉపయోగించే కమాండ్‌-అం‌డ్‌-‌కంట్రోల్‌ ‌కేంద్రాలు, ఉగ్ర స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ ‌తెలిపింది. ఈ దాడులపై హెజ్‌బొల్లా నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్‌ ‌చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ ‌కూడా భాగమని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్‌ ‌ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇజ్రాయెల్‌ ‌లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే అమెరికా-ఇరాన్‌ ‌మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్‌ఫైర్‌ ఒప్పందంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *