ప్రగతిభవన్ కంచేలైతే తొలగించారు కానీ ప్రతీ విశ్వవిద్యాలయంలో నిరసనలపై నిషేధం విధించి, విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విశ్వ విద్యాలయంలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొం దించాలని పైకి చెబుతూనే, తమ కింది స్థాయి అధికారులతో, విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో నిరసనలను అణ చివేస్తు న్నారు. ప్రభుత్వం తీరుతో యూని వర్సిటీల్లో అసలు ప్రశ్నించే అవకాశమే లేకుండా పోయింది. సమస్యలు ఉన్నందుకే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు, సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన చేయటంలో ప్రభుత్వం విఫలమవుతోందని తెలంగాణ పౌర సమాజం భావిస్తోంది.
ప్రజా నాయకుడు, ప్రశ్నించే గొంతుక గా పిలవబడే నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఒకప్పటి విద్యార్థి నాయకుడే.. అలాంటి ముఖ్య మంత్రి హయాంలో రాష్ట్రంలో విద్యా ర్థుల నిరసనలపై ప్రభుత్వం, విశ్వ విద్యా లయాల ఉన్నత అధికారులు అనుసరిస్తున్న తీరు నిజంగా అనుమా నాస్పదంగా ఉంది. విశ్వ విద్యాలయాల్లోని ఒకప్పటి విద్యార్థి నాయకులు ఎంతోమంది రాజకీయాల్లోకి వొచ్చి తమదైన గుణాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి యూనివర్సిటీలు బుద్ధి జీవులను మేధావులను, దేశ భవిష్యత్తును నిర్మించే కర్మగారాలుగా భావించాలి. ఇవి వివిధ భావజాలాలకు, వివిధ రకాల పరిశోధనలకు, సమాజంలో జరుగుతున్న సమస్యలకు పరిష్కారాలను వెతికే కేంద్రంగా ఉండాలి. వివిధ రకాల భావ జాలాలపై చర్చల ద్వారా ప్రభుత్వానికి, విద్యారంగ అభివృద్ధికి, రాష్ట్ర, దేశా భివృద్ధికి తగిన ప్రతిపాదనలు రావాలి, అయితే ప్రజా పాలనలో ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఎటువంటి నిర్బంధాలు ఉండవు. అందుకోసమే ప్రగతి భవన్ కంచెలు సైతం తొలగించామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రగతిభవన్ కంచేలైతే తొలగించారు కానీ ప్రతీ విశ్వవిద్యాలయంలో నిరసనలపై నిషేధం విధించి, విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విశ్వ విద్యాలయంలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొం దించాలని పైకి చెబుతూనే, తమ కింది స్థాయి అధికారులతో, విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో నిరసనలను అణ చివేస్తు న్నారు. ప్రభుత్వం తీరుతో యూని వర్సిటీల్లో అసలు ప్రశ్నించే అవకాశమే లేకుండా పోయింది. సమస్యలు ఉన్నందుకే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు, సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన చేయటంలో ప్రభుత్వం విఫలమవుతోందని తెలంగాణ పౌర సమాజం భావిస్తోంది.
గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించి యూనివర్సిటీలపై నాటి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రభుత్వం వొస్తే, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఈ విశ్వవిద్యాలయాలన్నింటిని అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అధ్యాపక సిబ్బందిని నియమించి, పరి శోధనలకు తగిన నిధులు కేటాయిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరు పూర్తిగా భిన్నంగా సాగుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అనేక సామాజిక మార్పులకు మూలకారణం విశ్వవిద్యాలయాలు, తెలంగాణ రాష్ట్రం సాకారం మొదలు, నేడు రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా అధికారం చేజిక్కించుకునే వరకు, అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించింది విశ్వవిద్యాలయ విద్యార్థులే.. అయితే నేటి ప్రభుత్వం ఆంక్షల పేరుతో, నిరసనలపై నిషేధం పేరుతో విద్యార్థి ఉద్యమాలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసనలు విధించారు. ఇక్కడ ధర్నాలపై, సామూహిక సమావేశాలపై నిషేధం విధిస్తూ సర్కులర్లను విడుదల చేశారు. దీని కారణంగా విద్యార్థుల లోపల ప్రశ్నించేతత్వాన్ని తుంచివేయాలనే కుట్రలు జరుగుతున్నాయని పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతటితో ఆగకుండా కనీసం సెమినార్లు నిర్వహించుకోవడానికి సైతం వొచ్చే స్పీకర్, ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ప్రచురించే ముందు, ఆ పోస్టర్, ఆయా వక్తను గురించిన వివరాలను విశ్వవిద్యాలయ ఉపకులపతికి చెప్పి అనుమతి తీసుకోవాలనే నిబంధన తెచ్చింది. దీంతో, ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని విశ్వవిద్యాలయ ఉపకులపతులతో, విద్యార్థులపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇదంతా విద్యార్థుల హక్కులను కాలరాయడంగానే తెలంగాణ విద్యార్థి సమాజం, మేధావులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయంలో సైతం అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కొన్ని డిపార్ట్మెంట్లకు తరగతి గదులు కూడా లేవు. కొన్నేళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. విద్యార్థులు ఆ సమస్యలను చెప్పుకునేందుకు అధికారులను కలిసే యత్నం చేస్తే వారు విద్యార్థులను కలవరు, అధికారులకు అనేక వినతి పత్రాలు ఇచ్చి నప్పటికీ పట్టించుకోవడంలేదు. విశ్వ విద్యాలయంలో శాంతియుతంగా నిర సనలు తెలిపితే సైతం ఉన్న తాధికారులు పనికట్టుకొని విద్యార్థులకు మెమోలు జారీ చేస్తూ, పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు.
అదే విధంగా హైదరాబాద్ కుతల మాని కమైన అనేక జీవ రాశులకు, జీవ వైవి ధ్యానికి నిలయంగా ఉన్న హైద రాబా ద్‌సెంట్రల్ యూనివర్సిటీ పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చాలా నిరం కుశంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో హెచ్ సీయూకు సంబంధించిన దృ శ్యాలను చూస్తే.. విశ్వ విద్యాలయంలోకి పోలీ సులు వచ్చారా లేకుంటే పోలీస్ స్టేషన్ లోనే హెచ్ సీయూను ఏర్పాటు చేశారా అన్న అనుమానం కలుగుతోంది. హెచ్ సీయూ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసు కునే యత్నాలను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస ఆందోళనలతో నిత్యం క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. గతంలో రేవంత్ రెడ్డి సైతం నా బెడ్ రూమ్ లోకి వొచ్చి పోలీసులు నన్ను అరెస్ట్ చేశారని బాధపడిన సంఘటన గుర్తొస్తుంది, మరి మా విశ్వ విద్యాలయంలోకి, పోలీసులు ఎలా ప్రవే శిస్తారు, విద్యార్థులను ఎలా అరెస్ట్ చేస్తారు, విచక్షణా రహితంగా ఆడా మగ అనే తేడా లేకుండా విద్యార్థులను కొట్టు కుంటూ తన్నుకుంటూ అరెస్ట్ చేయటం తప్పు కాదా? దీన్ని ఎలా సమరి్ధ స్తారు..
వెంటనే హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయ భూముల విషయంలో పున రాలోచన చేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో వెనక్కు తగ్గాలని తెలంగాణ విద్యార్థి సమాజం డిమాండ్ చేస్తుంది. యూని వర్సిటీల వీసీలు, విద్యార్థి సంఘాలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, అక్కడి సమస్యలను అధ్యయనం చేసి, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. అధ్యాపకుల నియా మకాలు చేపట్టి, బడ్జెట్లో సరిపడా నిధులను కేటాయించి విశ్వ విద్యాలయాల అభివృద్ధికి బాటలు వేయాలని కోరు తున్నారు. విద్యార్థి నాయకత్వానికి అవ కాశం కల్పించి విద్యార్థులకు ప్రశ్నించే అవకాశం కల్పించి రానున్న రోజుల్లో రాష్ట్రాభివృద్ధిలో విద్యార్థులను భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ విద్యార్థి సమాజం కోరుకుంటున్నది.
– జవ్వాజి దిలీప్, స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం,
ఫౌండర్ మెంబర్, 7801009838.





