ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

– అన్ని రకాలుగా తెలంగాణ అనుకూలం
– ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్‌బాబు  
హైదరాబాదన, ప్రజాతంత్ర, సెప్టెంబర 22: దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ ఏర్పోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సచివాలయంలో సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంపోనెంట్‌ తయారీ, సప్లై చైన్‌, మెయింటెనెన్స్‌, రిపేర్‌ అండ్‌ ఓవర్‌హాల్‌(ఎమ్మార్వో), అవియానిక్స్‌, రాడార్‌ అండ్‌ సెన్సార్‌ సిస్టమ్స్‌, న్యూ-స్పేస్‌ అండ్‌ చిన్న ఉపగ్రహాలు, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ కంపోజిట్స్‌ తయారీలో తెలంగాణలో ఉన్న అవకాశాలు, అనుకూలతలను మంత్రి శ్రీధర్‌బాబు వారికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఏరోస్పేస్‌ పార్కులు, సెజ్‌లు, భారీ ఎంఎస్‌ఎంఈ నెట్‌వర్క్‌, శక్తిమంతమైన ఆర్‌అండ్‌డీ, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అత్యుత్తమ ప్రతిభ గల మానవ వనరులు, సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, పారిశ్రామిక ప్రోత్సాహాక విధానాలతో కూడిన పటిష్ఠమైన ఎకో సిస్టమ్‌ అందుబాటులో ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీజీ-ఐపాస్‌ ద్వారా 15 రోజుల్లోనే వేగంగా అనుమతులు ఇస్తున్నాం అని చెప్పారు. ‘హైదరాబాద్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌, డీఆర్‌డీవో వంటి కేంద్ర సంస్థలు, టాటా అడ్వాన్స్‌డ సిస్టమ్స్‌, ధ్రువ స్పేస్‌, స్కైరూట్‌ స్పేస్‌, బోయింగ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, జీఈ ఏవియేషన్‌, ప్రాట్‌ అండ విట్నీ లాంటి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. హై ప్రెసిషన్‌ మెషినింగ్‌, షీట్‌ మెటల్‌, హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌ వంటి క్లిష్టమైన భాగాలను ఇక్కడ తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేయొచ్చని తెలిపారు. విమానాలు, హెలికాప్టర్ల ఇంజిన్ల నిర్వహణలో ఇటలీకి ఉన్న నైపుణ్యం ఇక్కడి డిఫెన్స్‌, ప్రైవేట్‌ రంగాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘అవియానిక్స్‌, రాడార్‌ అండ సెన్సార్‌ సిస్టమ్స్‌లో ఇటలీ కంపెనీలకు అపార అనుభవం ఉందని, ఈ రంగానికి చెందిన వస్తువులను ఇక్కడ ఉత్పత్తి చేస్తే దేశ రక్షణ రంగం అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చునని అన్నారు. ‘ధ్రువ స్పేస్‌, అనంత్‌ టెక్నాలజీస్‌, స్కైరూట్‌ వంటి హైదరాబాద్‌ స్టార్టప్‌లు ఇప్పటికే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాయని, వీటితో కలిసి శాటిలైట్‌ సబ్‌-సిస్టమ్స్‌, పేలోడ్స్‌ తయారీలో భాగస్వామ్యం కావొచ్చునని, తేలికైన, అధిక బలం కలిగిన కంపోజిట్స్‌ తయారీలో ఇటలీకి ఉన్న ప్రత్యేక పరిజ్ఞానానికి ఇక్కడ అధిక డిమాండ్‌ ఉంది అని తెలిపారు. ‘తెలంగాణ-ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ సీఎస్‌ సంజయ్‌ కుమార్‌, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ పీఏ, కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇటలీ ఇన్‌ బెంగళూరు జియాన్‌డొమెనికో మిలానో, ట్రేడ్‌ కమిషనర్‌ అంటోనియెట్టా బక్కానారి, ఇండస్ట్రియల్‌ ఇంటర్నేషనలైజేషన్‌, నేషనల్‌ ఎకానమీ మిషన్స్‌ సెక్షన్‌ హెడ్‌ సిల్వియా సిక్కారెల్లి, ప్రెసిడెన్సీ ఆఫ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ లూగి రిగ్గియో, మల్టీ లేటరల్‌ సైంటిఫిక్‌ డిప్లోమసీ హెడ్‌ అలెశాండ్రో గార్బెల్లిని, వాన్‌జెట్టి ఇంజనీరింగ్‌ ఎస్‌ఆర్‌ఎల్‌, లియోనార్డో, లీఫ్‌ స్పేస్‌ ఎస్‌పీఏ, ఎలిటాల్‌-ఎలట్రానికా ఇటాలియానా-సోసియెటా, ఏ రెస్పాన్సిబిలిటా, ఈఐఈ గ్రూప్‌, అరేసిస్‌, నానో-టెక్‌ ఎస్‌పీఏ, ఈఎల్టీ గ్రూప్‌, ఆఫీసినా స్టెల్లారే ఎస్‌పీఏ, స్టెల్లార్‌ ప్రాజెక్ట్‌ తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నా
—————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *