– మంత్రి ఉత్తమ్‌తో డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ భేటీ
– రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: వాణిజ్య, పారిశ్రామిక రంగంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ శుక్రవారం ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి అని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర విశిష్టతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు వివరించారు. ఐ.టి రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో ఇక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధునిక వసతులు, ఫార్మా రంగంలో పురోగతిని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారని, డెన్మార్క్ వంటి దేశం కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





