మావోయిస్టులు అద్దెకున్న ఇళ్ల పరిశీలన

– కేబుల్‌ ‌పని కోసం వొచ్చినట్లు గుర్తింపు
– ఆరా తీసిన స్థానిక పోలీసులు
ఏలూరు, నవంబర్‌ 21: ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వొచ్చాయి. వీరంతా కేబుల్‌ ‌పని చేస్తామంటూ ఇల్లు అద్దెకు దిగారు. నెలకు రూ. 10 వేలు చొప్పున అద్దె చెల్లిస్తామంటూ ఆ ఇంట్లోకి మావోయిస్టులు దిగారు. ఆ ఇంట్లో భారీగా మనుషులు ఉన్నా వారిలో ఇద్దరు మాత్రమే బయటకు వొచ్చి ఆహారం తీసుకువచ్చే వారని స్థానికులు వెల్లడించారు. మిగిలిన వారంతా ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. అక్టోబర్‌ 26‌న మావోయిస్టులు ఇల్లు అద్దెకు తీసుకున్నారని తెలిపారు. ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టులు ఇల్లు వెతుక్కుంటూ స్వయంగా వారే వొచ్చారా? లేకుంటే ఎవరైనా మధ్యవర్తిత్వం వహించారా?  ఆ మధ్యవర్తులు ఎవరనే కోణంలో పోలీసులు ఆ ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు. నవంబర్‌ 18‌వ తేదీ తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంప చోడవరం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజేతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. అదే రోజు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని ప్రధాన నగరాలు విజయవాడ, కాకినాడ, ఏలూరుల్లో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వారిని కోర్టులో హాజరుప‌ర‌చ‌గా రిమాండ్‌ ‌విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *