మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌

న్యూఢల్లీి, జూలై 3:మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారని భారత విదేశాంగ శాఖ గురువారం ధ్రువీకరించింది. పశ్చిమ మాలిలోని కాయెస్‌ ప్రాంతంలోని డైమెండ్‌ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 1న ఈ ప్రాంతంపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్‌ నుస్రత్‌ అల్‌ ఇస్లాం వాల్‌ ముస్లిమిన్‌ ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. కిడ్నాప్‌కు గురైన వారి వివరాలను విదేశాంగ శాఖ వెల్లడిరచలేదు. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. బందీలను సురక్షితంగా, త్వరగా విడుదల చేయడానికి మాలి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా మాలిలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని, సాయం కోసం మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *