ఉత్తరాదిన పెరిగిన చలి

– దిల్లీలో పొగమంచుతో విమానాల ఆలస్యం

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 15: ఉత్తర భారత దేశాన్ని చలి గడగడలాడిస్తున్న‌ది. రాజధాని దిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దిల్లీ సహా పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌జార్ఖండ్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌సహా పలు రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో విపరీతమైన పొంగ మంచు కమ్ముకోవడంతో చలి తీవ్రత పెరిగిపోయింది. ఉదయం పూట హైవే పై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో వాహనదారులు ఎంతో ఇబ్బందిపడుతున్నారు. దిల్లీ-ఎన్సీఆర్‌‌ప్రాంతంలో పొగమంచి విపరీతంగా కమ్మేసింది. దీంతో విమాన, రైలు రాకపోకలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే దిల్లీ ఎయిర్‌పోర్ట్  ఒకేసారి 100 కు పైగా విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు 300 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొగమంచు కారణంగా సుమారు వంద రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్లీలో పొగమంచు పరిస్థితి నేపథ్యంలో దిల్లీ ఎయిర్‌ ‌పోర్ట్ ‌ప్రయాణికులకు కీలక సూచన జారీ చేసింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానాల స్టేటస్‌ ‌చెక్‌ ‌చేసుకోవాలని తెలిపింది. ఎయిర్‌లైన్‌ ‌సిబ్బంది వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నార‌ని, దిల్లీ విమానాశ్రయ ఆధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపింది. భద్రతా ప్రోటోకాల్‌ ‌కు అనుగుణంగా పనిచేస్తన్నాయని ఎయిర్‌లైన్స్ ‌పేర్కొంది. మరోవైపు ఇండిగో, ఎయిర్‌ ఇం‌డియా వాతావరణ పరిస్థితిలు దృష్ట్యా పలు విమానాలు రద్దు కాగా, మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. విమానాల స్టేటస్‌ ‌గురించి తెలుసుకోవాలంటే వెబ్‌ ‌సైట్స్ ‌కి వెళ్లి చెక్‌ ‌చేసుకోవాల్సిందిగా సూచించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *