– కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం
– ముగిసిన ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్
– విజేతలు, రన్నరప్‌లకు బహుమతులు అందజేత
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: కిట్స్ వరంగల్ ప్రాంగణంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) వరంగల్ క్యాంపస్‌లో శుక్ర, శనివారాలు జరిగిన ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ మెన్ -2025-26 (ఫేజ్-1) విజయవంతంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఆటలు, క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా నిర్ణయాధికారం మెరుగవుతుందని, ఒత్తిడిని అధిగమించడంద్వారా నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందుతాయని సూచించారు. జిల్లాస్థాయి క్రీడల్లో పాల్గొనడం ద్వారా జాతీయ స్థాయిలో అవకాశాలను పొందవచ్చన్నారు. ఆటలు, క్రీడలు యువతలో ఐక్యత, క్రమశిక్షణ, శారీరక శ్రేయస్సును పెంపొందిస్తాయన్నారు. టోర్నమెంట్‌ల ద్వారా ఆటలను ప్రోత్సహించడంలో శారీరక విద్య విభాగం అన్ని సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. కృతనిశ్చయంతో పెద్ద కలలు కనండి.. ఆశయం కోసం కష్టపడండి అని ఉద్బోధించారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ వై.వెంకయ్య మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆటల పట్ల పెరుగుతున్న మక్కువతో క్రీడలు, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడంలో కాకతీయ విశ్వవిద్యాలయం, కిట్స్ వరంగల్ అధికారుల నిబద్ధతకు ఈ టోర్నమెంట్ నిదర్శనమన్నారు. ఆరు గేమ్‌లలో (ఇండోర్, అవుట్‌డోర్) విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను పంపిణీ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ ఈ ప్రాంతంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, అత్యున్నత స్థాయిలో పోటీ పడేందుకు టోర్నమెంట్ వేదికను కిట్స్ వరంగల్ అందించిందన్నారు. రాష్ట్ర, ఉన్నతస్థాయి టోర్నమెంట్‌లలో మీ డైనమిక్ ప్రదర్శన ద్వారా వరంగల్ జెండాను ఉన్నతంగా ఉంచాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో కిట్స్‌డబ్ల్యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్, పి.రమేష్ రెడ్డి, అన్ని విభాగాల ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి, కిట్స్‌డబ్ల్యు ఫిజికల్ డైరెక్టర్లు వెంకటస్వామి, మహేష్, నాగరాజు, డాక్టర్ ఏటిబి టి.ప్రసాద్, డాక్టర్ శ్రీధర్, శశికాంత్, గోపీకృష్ణ, నరేందర్, సుమన్, డీన్‌లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, కేయూ పరిధిలోని ఆదిలాబాద్, ఖమ్మం వరంగల్ వంటి ఉమ్మడి జిల్లాల 31 కళాశాలల నుండి 750 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





