విస్తారంగా వానలు..

  • ప్రాజెక్టులకు జలకళ
    ప్రధాన జలాశయాల్లో గేట్లు ఎత్తివేత
    ప‌ర్యాట‌కుల సంద‌డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్19: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains ) నదులు, కాల్వ‌లు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ మేరకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఆ దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. నాగార్జునసాగర్‌, శ్రీ‌శైలం,జూరాల, తుంగభద్ర సింగూరు వంటి ప్రాజెక్టులకు ప్రజలు తరలివస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నీటి విలువ వివరాలను తాజాగా అధికారులు వెల్లడించారు.

శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి దిగవ భాగానికి 1.51లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉందని.. చెప్పారు. ఈ మేరకు శ్రీశైలంలో 10, సాగర్‌లో 26 గేట్లు ఎత్తినట్లు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి, లక్షా 83 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేపినట్లు పేర్కొన్నారు. అలాగే నిర్మల్‌, ‌కడెం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి, 16 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌పరిధిలోని జూరాల ప్రస్తుత నీటిమట్టం 317.370 టర్లకు చేరుకుందని చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 టర్లుగా ఉందని పేర్కొన్నారు. దేవరకద్ర మండలం కోయిల్‌ ‌సాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద తగ్గినట్లు తెలిపారు. ఒక గేట్‌ ఎత్తి 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 8 గేట్లు ఎత్తి దిగువకు 10,279 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 642.79 అడుగులుగా ఉందని, ప్రస్తుతానికి 642.79 అడుగుల నీటిమట్టానికి చేరుకుందని చెప్పారు.

అలాగే.. పులిచింతల ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం ఉందని పేర్కొన్నారు. 14 గేట్లు ఎత్తి దిగువకు 4,18,092 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 167.485 అడుగులుగా ఉందని వెల్లడించారు. జిల్లాలోని మరో భారీ ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్‌కు భారీ వరద కొనసాగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 26 గేట్లు ఎత్తి దిగువకు 3,98,660 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామార్థం 312.0450 టీఎంసీలుగా ఉంటే..ప్రస్తుతం 298.12 టీఎంసీలకు చేరుకుందని స్పష్టం చేశారు.

సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 29.917 టీఎంసీలుగా ఉంటే.. ప్రస్తుతం 19.534 టీఎంసీలుగా నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. ఇకపోతే అధిక వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్న‌ది. ఎస్‌.ఆర్‌.ఎస్‌.‌పి ప్రాజెక్టు నుండి అధికంగా వరద నీరు రావటంతో ప్రాజెక్టుకు ఇన్‌ ‌ప్లో పెరిగింది. ఎస్‌.ఆర్‌.ఎస్‌.‌పి ప్రాజెక్టు నుండి అధికంగా 1,73,578 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చిచేరుతుంది. కడెం ప్రాజెక్టు నుండి 11 వేల క్యూసెక్కుల వరద నీరు, వర్షం ద్వారా 71 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతున్న‌ది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ ‌ఫ్లోలో 2,55,707 క్యూసెక్కులు కాగా అధికారులు 35 గేట్లు తెరిచి 3,46,846 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 16.7912 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మంగపేటలో 18.6 సెంటీటర్ల వర్షపాతం నమోదు

నీట మునిగిన పంట చేలు
కల్వర్టులపై నుంచి పారుతున్న నీరు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 18.6 సెంటీటర్ల వర్షపాతం నమోదయింది.

ఏటూరునాగారం 16.1, వెంకటాపురం (ములుగు)లో 12.1 సెం.., జైనథ్‌ (ఆదిలాబాద్‌)‌లో 11.6, మల్లూరు (ములుగు)లో 11.6 సెం.., వాంకిడి (ఆసిఫాబాద్‌)‌లో 11.3, సాత్నాల (ఆదిలాబాద్‌)‌లో 11, ములుగు జిల్లా తాడ్వాయిలో 10.4, కన్నాయిగూడెంలో 10.2, ధర్మవరంలో 10.2, మేడారంలో 10.2, ఆదిలాబాద్‌ ‌జిల్లా సిరికొండ 9.7, రాంనగర్‌ 8.9, ‌గుడిహత్నూరులో 8.9, జంబుగ (ఆసిఫాబాద్‌)‌లో 8.6 సెం.., సర్వాయిపేట (భూపాలపల్లి) 8, ధనోరా (ఆసిఫాబాద్‌) 7.5, ఆసిఫాబాద్‌ ‌జిల్లా రెబ్బెనలో 7.5, కెరమెరిలో 7.3, ఆదిలాబాద్‌ అర్బన్‌లో 7.1, బిక్నూర్‌ (‌కామారెడ్డి) 6.8, వాజేడు (ములుగు) 6.7, ఉట్నూరు (ఆదిలాబాద్‌) 6.5, ‌సిర్పూర్‌ (‌టి) (ఆసిఫాబాద్‌) 6.4, ఇచ్చోడ 6.3, మెదక్‌ ‌జిల్లా కాగజ్‌మద్దూరులో 6.2 సెంటీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *