ధాన్యాన్ని ద‌ళారుల‌కు విక్ర‌యించ‌వ‌ద్దు

– ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం త‌నిఖీ
– క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 23:  యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన‌ ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయి.. అన్ని కుప్పలను రోజు మాయిశ్చ‌ర్ చెక్ చేస్తున్నారా తెలుసుకొని తేమ శాతం వచ్చిన వాటిని వెంటనే తూకం వేసి లారీ లోడ్ చేసి మిల్లులకు తరలించాల‌ని, ఆలస్యం చేయొద్ద‌ని అన్నారు. కొనుగోలు కేంద్రంలో కరెంటు సదుపాయం  కల్పించాలని రైతులు కోరడంతో వెంటనే =కరెంటు ఎస్ఈ కి ఫోన్ చేసి సాయంత్రం లోపు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రైతులు ఎవ్వరు కూడా బయట దళారులకు ధాన్యం విక్రయించవద్దని. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *