భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా-గరియాబంద్ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన పదిమంది నక్సల్స్ ను పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ నక్సల్స్‌పై మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు రివార్డులను ప్రకటించాయి. మృ తిచెందినవారిలో కీలక నేతలు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, ప్రమోద్ అలియాస్ పాండు ఉన్నారని, వీరికి భారీ గానే రివార్డులు ప్రకటించాయి. తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందిన బాలకృష్ణ అలియాస్ మనోజ్‌పై రూ.కోటి 50 లక్షల రివార్డు ప్రకటించారు. అలాగే ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆంధ్రప్రదే శ్‌కి చెందిన ప్రమోద్ అలియాస్ పాండుకు రూ.65 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విక్రమ్ అలియాస్ మంజు ఇతడిపై ఒడిశా రూ. 13 లక్షలు, ఎస్‌యంసి సభ్యురాలు రజిత, టెక్నికల్ టీమ్ సభ్యురాలు సింధు, అంజలి, ఉమేష్ అలియాస్ సుకన్‌లపై ఒక్కొక్కరిపై రూ.13లక్షల రివార్డు ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విమల్ అలియాస్ మంగన్న అలియాస్ సురేష్ పై రూ.18లక్షల రివార్డు ఉంది. సమీర్, ఆరతి టీమ్ సభ్యురాలిపై మూడు రాష్ట్రాలు రూ.3 లక్షల రివార్డు ప్రకటించాయి. ఈ రివార్డులను విడుదల చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





