పలువురు ఐఎఎస్‌ల బదిలీలు

– ప్రభుత్వ స‌ల‌హాదారుగా ఎన్వీఎస్‌ ‌రెడ్డి నియామకం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16: ‌రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఎన్వీఎస్‌ ‌రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎన్వీఎస్‌ ‌రెడ్డిని హెచ్‌ఎంఆర్‌ఎం‌డీ బాధ్యతల నుంచి రిలీవ్‌ ‌చేసిన ప్రభుత్వం.. మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్‌ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్‌ఎం‌డీఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ ‌చీఫ్‌ ‌రేషనింగ్‌ అధికారిగా ఎం.రాజారెడ్డి, ఆదిలాబాద్‌ ‌జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్‌  ‌నియమితులయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *