రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 36 మంది అధికారులకు స్థాన‌చ‌ల‌నం క‌ల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమించింది. టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జే శంకరయ్య, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును నియమించింది. హన్మకొండ కలెక్టర్ గా స్నేహ శబరీష్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నవీన్ నికోలస్, ఖమ్మం నూతన కలెక్టర్ గా దురిశెట్టి అనుదీప్ నియమితులయ్యారు. స్త్రీ, శిశు సంక్షేమ డైరెక్టర్ గా శ్రీజన, హైదారాబాద్ జిల్లా కలెక్టర్ గా దాసరి హరిచందన, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గా ప్రియాంకా అలా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ గా రాజీవ్ గాంధీ హన్మంత్, నిజామాబాద్ కలెక్టర్ గా టి. వినయ్ కృష్ణా రెడ్డి, జీఎడి జాయింట్ సెక్రటరీ గా చిట్టెం లక్ష్మీ నియమితులయ్యారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి కలెక్టర్ గా బదిలీ అయ్యారు. హనుమకొండ నూతన కలెక్టర్ గా స్నేహ శబరీష్ నియమితుల‌య్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్వని తానజీ, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా చాహాట్ బాజ్ పాయ్ వ‌చ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *