వివాదాలకు నేను దూరం

– పార్టీ ప్రయోజనాలే ముఖ్యం
– మీడియాతో వేం నరేందర్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: తాను వివాదాలకు దూరమని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి వేం నరేందర్‌ ‌రెడ్డి రాజ్యసభకు ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం అసెంబ్లీలోని డియా పాయింట్‌ ‌వద్ద వేం నరేందర్‌ ‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ ప్రయోజనాలే తన ప్రయోజనాలని  తెలిపారు. తెలంగాణ రాష్టాన్రికి తన వంతుగా చేయగలిగింది చేస్తానని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌తో తనకు స్నేహం ఉందని చెప్పారు. అయితే సోషల్‌ ‌డియాలో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. తనకు కొత్త విషయాలు నేర్చుకోవడమంటే ఇష్టమని పేర్కొన్నారు. ఇన్ని రోజులు తన పని.. పద్దతి ఒకలా ఉండేదని.. ఇకపై మరోలా ఉంటుందన్నారు. రాజ్యసభకు అవకాశం కల్పించిన పెద్దలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైనట్లుగా తాను ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నానని చెప్పారు. 2004 నుంచి 2009 వరకు తాను ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పటి నుంచి పార్లమెంట్‌ ‌వేదికగా పని చేయబోతున్నానని తెలిపారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభలో పోరాడతానని వేం నరేందర్‌ ‌రెడ్డి వెల్లడించారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *