హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27ః మహా నగర ఆస్తులు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతోపాటు నగర సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఆయువుపట్టు లైన చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోందన్నారు. ఆ క్రమంలో మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పని చేస్తున్న పలువురు ఇంజనీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకోగా రంగంలోకి దిగి వారి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





